చేతుల్లో గన్స్.. డ్యాన్స్ చేస్తూ హల్‌చల్..

గన్‌ పట్టుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇలా వైరల్ కావడం ఇదే తొలిసారి కాదు. గత జూన్ నెలలో బీజేపీకి చెందిన ప్రణవ్ సింగ్ అనే ఎమ్మెల్యే కూడా ఇలాగే గన్ పట్టుకుని డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: October 18, 2019, 3:54 PM IST
చేతుల్లో గన్స్.. డ్యాన్స్ చేస్తూ హల్‌చల్..
చేతిలో గన్స్‌తో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి
  • Share this:
రెండు చేతుల్లో రెండు గన్స్ పట్టుకుని బాలీవుడ్ సాంగ్‌కి స్టెప్పులేసిన ఓ వ్యక్తి వీడియో ఉత్తరాఖండ్‌లో వైరల్‌గా మారింది. అయితే ఆ వ్యక్తి ఎవరు.. ఆ గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీడియో ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో దీనిపై విచారణకు ఆదేశించారు. చూడటానికి అదో ఇల్లు లాగే కనిపిస్తుండగా.. తెల్లని బనియన్‌లో గన్స్‌తో అతను హల్‌చల్ చేశాడు.

అతనెవరో తెలుసుకునేందుకు మేము విచారణ జరుపుతున్నాం. నిజానిజాల ఆధారంగా అతనిపై చర్యలు తీసుకుంటాం. ఈ వీడియో హరిద్వార్‌కి చెందిన వ్యక్తిదా లేక బయటి వ్యక్తిదా అన్న కూడా పరిశీలించనున్నాం.
అభయ్ సింగ్, స్థానిక పోలీస్ అధికారి


కాగా, గన్‌ పట్టుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇలా వైరల్ కావడం ఇదే తొలిసారి కాదు. గత జూన్ నెలలో బీజేపీకి చెందిన ప్రణవ్ సింగ్ అనే ఎమ్మెల్యే కూడా ఇలాగే గన్ పట్టుకుని డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది.దాంతో పార్టీ క్రమశిక్షణ చర్యల కింద అతన్ని బహిష్కరించింది.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు