VIDEO OF DRUG SALES GOING VIRAL IN PUBLIC PLACES IN UTTAR PRADESH SNR
Video Viral:యూపీలో పబ్లిక్‌గా డ్రగ్స్ సేల్స్..దందా ఏ రేంజ్లో ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది
Photo Credit:Youtube
Video Viral:ఉత్తరప్రదేశ్‌లో డ్రగ్స్ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. గంజాయి, నల్లమందుతో పాటు నిషేధిత డ్రగ్స్‌ని ఇళ్లలో స్టాక్ పెట్టుకొని ఆడవాళ్లే అమ్ముతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈవీడియోపై విచారణ చేపడతామంటున్న పోలీసులు డ్రగ్స్ మాఫియాను అరికడతామని మాత్రం చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో నిషేధిత మాదకద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతోంది. గోవా(Goa)లో డ్రగ్స్ దొరుకుందనే మాటలో ఎంత నిజం ఉందో..ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ( Lakhimpur Kheri)జిల్లాలో కూడా గంజాయి(Marijuana), నల్లమందు(Opium), అమ్మకాలు అంతే విచ్చలవడిగా జరుగుతున్నాయన్నది అంతే వాస్తవం. చాపకింద నీరులా కాదు అంతా పబ్లిక్‌గా డోర్ టు డోర్ డెలవరీ అన్న చందంగా గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో ప్యాక్ చేసిన కొందరు వ్యక్తులు బైక్‌లపై తిరుగుతూ అమ్ముతున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు, ఎక్సైజ్ పోలీసులు(Excise police) ఎంత మంది ఉన్నా ఈ డ్రగ్ డీలర్ల దందా మాత్రం లఖీంపూర్ ఖేరీలో మూడు సంచులు, ఆరు ప్యాకెట్లు అన్న చందంగా సాగిపోతోంది. స్వయంగా డ్రగ్ విక్రయించే వ్యక్తే బైక్‌పై వచ్చి కస్టమర్ చేతిలో గంజాయి ప్యాకెట్ పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గోలా (Gola)కొత్వాలి (kotwali)ప్రాంతం పోలీస్ స్టేషన్(Police Station)కి దగ్గర్లోనే ఓ యువకుడు ప్లాటిన బైక్‌పై వచ్చి కస్టమర్‌కి గంజాయి ప్యాకెట్ అమ్ముతున్న డబ్బులు తీసుకొని వెళ్లిపోయాడు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లఖీంపూర్‌ఖేరిలో ఈతరహా డ్రగ్స్(Drugs) దందా అంతా పోలీసుల కనుసన్నాల్లోనే జరుగుతుందని స్థానికులు అంటున్నారు. డ్రగ్స్ అమ్ముతున్న వీడియో(Video)లో సోషల్ మీడియా(Social media)లో వైరల్ (Viral)అవుతున్నాయి. యువకులు, మైనర్లకు ఈ తరహా మత్తు పదార్ధాలకు బానిసల్ని చేస్తున్నారు ఇక్కడ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న వాళ్లు. యువకుల శరీరాల్లోకి గంజాయి, నల్లమందు వంటి డ్రగ్స్‌ని నిదానంగా విషం రూపంలో ఎక్కిస్తున్నారు. గోలా కొత్వాలి ప్రాంతంలో డ్రగ్స్‌ని ఏకంగా ప్లేస్ టు ప్లేస్ డెలవరీ చేస్తుంటే మథుర నగరంలో డ్రగ్స్ వ్యాపారులు మరింత బరితెగించారు. పర్మిషన్లు తీసుకొని ఏర్పాటు చేసుకున్న వ్యాపార సముదాయాల మాదిరిగా ఏకంగా ఇంటినే డ్రగ్స్ దుకాణంగా మార్చారు. ఇంకా విచిత్రం ఏమిటంటే ..ఇక్కడ ఇళ్లలో గంజాయి, నల్లమందుతో పాటు నిషేదిత డ్రగ్స్‌ని మహిళలే దగ్గరుండి విక్రయించడం కనిపిస్తుంది.
యూపీలో పబ్లిక్‌గా డ్రగ్స్ సేల్స్..
లఖీంపూరిఖేరిలో దృశ్యాలు చూస్తుంటే డ్రగ్స్ అమ్ముకునేందుకు పోలీసులే అనాధికారికంగా పర్మిషన్ ఇచ్చినట్లుగా అర్దమవుతుంది. అయితే ఈ డ్రగ్స్ విక్రయం ఇప్పుడు కొత్తగా నడుస్తున్నది కాదని ఎన్నో సంవత్సరాలుగా ఈ తరహా డ్రగ్స్ మాఫియా చలామణి అవుతోందంటున్నారు ఈప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు. పబ్లిక్‌గా డ్రగ్స్ అమ్ముతున్న వీడియోలు ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికి పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
పట్టించుకోని పోలీసులు..
ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్న డ్రగ్స్ అమ్మకానికి సంబంధించిన వీడియోలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వడం లేదు. అయితే వీడియో ఆధారంగా డ్రగ్స్ అమ్ముతున్న వాళ్లను పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రమే చెబుతున్నారు. అయితే ఈ డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న వారిని ఎప్పటిలోగా పట్టుకుంటారు. ఇకపై ఇలాంటి వ్యాపారాలు జరగకుండా చూస్తామనే వాగ్ధానం మాత్రం ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇవ్వకపోవడం చూస్తుంటే ఈ ఈ దందా ఇకపై కూడా కొనసాగిన ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు స్థానికులు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.