Home /News /crime /

VIDEO OF A YOUNG MAN DANCING WITH A GUN AT A WEDDING IN BIHAR GOES VIRAL SNR

Video Viral:ఓరి వాడి పాసుగాల..పెళ్లికెళ్లి డ్యాన్సర్‌కి తుపాకీ ఎక్కడ గురి పెట్టాడో చూడండి

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Bihar:పెళ్లి వేడుకలో ఓ యువకుడు చేసిన హల్‌చల్‌ అంతా ఇంత కాదు. పెళ్లి వాళ్లు డిస్కో ఏర్పాటు చేస్తే స్టేజ్‌పైన తుపాకీ పట్టుకొని డ్యాన్సర్లకు గురి పెట్టాడు. లేడీ డ్యాన్సర్లు భయపడిపోవడంతో నవ్వుతూ డ్యాన్స్ చేశాడు. పెళ్లికి వచ్చిన వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వార్త వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
గానా,బజానా, తీన్‌మార్‌ డ్యాన్స్‌లు, డీజే సౌండ్స్‌తో సందడిగా జరగాల్సిన పెళ్లి వేడుకలో తుపాకీలు, లేడీ డ్యాన్సర్లు, పోకిరీ పోరగాళ్లతో టెన్షన్ వాతావరణం నెలకొంది. బిహార్‌(Bihar)లో ఓ పెళ్లి జరుగుతుంటే కుర్రాళ్లు పూలు చల్లటం, లేదంటే డ్యాన్స్‌లు వేయడం చూద్దామనుకున్నారు అతిధులు, పెళ్లి చేస్తున్నపెద్దలు. కాని చేతుల్లో పిస్టోల్స్ పట్టుకొని ట్రిగ్గర్‌పై వేళ్లు కదిలిస్తూ డ్యాన్స్‌ గర్ల్స్‌కి గురి పెట్టడం అందర్ని షాక్‌కి గురి చేసింది. గోపాల్‌గంజ్(Gopalganj)జిల్లా కేంద్రంలోని నగర్‌ పోలీస్‌ స్టేషన్‌(Police station)పరిధిలోని జాదోపూర్‌ (Jadopur)రోడ్డులో ఓ పెళ్లి జరిగింది. అక్కడికి వచ్చిన కృష్ణకుమార్ (Krishnakumar) అనే యువకుడు పెళ్లి వాళ్లు ఏర్పాటు చేసిన డిస్కో డ్యాన్స్ (Disco Dance)ప్రోగ్రామ్ వేదికపై పిస్టోల్‌ పిస్టోల్‌ పట్టుకొని హల్‌చల్ చేశాడు. డ్యాన్స్‌ గర్ల్స్(Dance‌ Girl)అర్ధనగ్నంగా చిందులు వేస్తుంటే వాళ్ల నాభిBelly, ఛాతిchest భాగంపై గురి పెడుతూ డ్యాన్స్ చేయడంతో పెళ్లికి వచ్చిన వాళ్లు, పెళ్లి తరపు బంధువులు షాక్ అయ్యారు. అక్కడ ఉన్న వాళ్లంతా ఇదేదో బొమ్మ తుపాకి అనుకొని వాళ్ల డ్యాన్స్‌ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే ..స్టేజ్‌పై ఉన్న డ్యాన్స్‌ గర్ల్‌ మాత్రం అది బుల్లెట్లు (Bullets)లోడ్ చేసిన తుపాకి అని తెలిసి భయపడిపోయింది. స్టేజ్‌పైనే కృష్ణకుమార్‌తో డ్యాన్స్ చేయడానికి జంకుతూ ఆగిపోవడంతో..అప్పుడు పెళ్లి వేడుకను చూసేందుకు వచ్చిన వారికి అర్ధమైంది. బిహార్‌లో పెళ్లి వేడుకలో పోకిరీ గ్యాంగ్‌ ఇంత అరాచకం చేస్తుంటే కొందరు వీడియో తీసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేశారు. దాంతో వెడ్డింగ్ వీడియో కంటే ఈ అగ్లీ డ్యాన్స్ వీడియోని వైరల్ అవుతోంది.

ఓరి వాడి పాసుగాల..
పెళ్లిలో మారణాయుధులు ఉపయోగించడానికి పర్మిషన్ ఉండదు. పోని తుపాకి గురి పెట్టిన వ్యక్తికి ఏమైనా గన్ పర్మిషన్ ఉందా అంటే అది కూడా లేదు. డిస్కో ప్రోగ్రామ్‌కి వచ్చిన ఓ యువకుడు డైరెక్ట్‌గా పిస్టోల్‌ తెచ్చి పబ్లిక్‌గా డ్యాన్స్‌ చేస్తున్న లేడీ డ్యాన్సర్‌కి గురి పెట్టిన విషయం గోపాల్‌గంజ్ పోలీసులకు చేరింది. వెంటనే కేసు నమోదు చేసుకొని పెళ్లి వారిపై కేసు నమోదు చేశారు. పిస్టోల్‌తో హల్‌చల్ చేసిన వ్యక్తి ఎవరూ అతనికి గన్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.
పోకిరోడు కాదు..పొగరుబోతు..

ఇంకా విచిత్రం ఏమిటంటే తుపాకీతో డ్యాన్స్ చేసిన కృష్ణకుమార్..ఈ వీడియోని తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్ట్ చేయడం మరింత వివాదాస్పదమైంది. ఈ వీడియో తరహాలోనే మరికొన్ని ఫోటోలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత పొగరుంటే ఈ వీడియోని తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడని నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరు ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Bihar News, VIRAL NEWS, Viral Video

తదుపరి వార్తలు