VIDEO OF A PREGNANT WOMAN GIVING BIRTH IN AN AUTO DUE TO NEGLIGENCE OF MEDICAL PERSONNEL IN BIHAR WENT VIRAL SNR
OMG: బిడ్డకు ప్రాణం పోయమంటే..ఫోన్లు చూస్తున్నారు..వాళ్లేం చేశారో ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది
Photo Credit:Youtube
VIDEO VIRAL:నిండు గర్భంతో ఉన్న మహిళకు వైద్యం అందించమంటే నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫోన్లు చూసుకుంటూ..టీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నారు. అర్జెంట్‌గా రమ్మని కోరితే వస్తాములే పో అని నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. నొప్పులు భరించలేకపోయిన గర్భిణి ఆసుపత్రి ముందు ఆటోలో డెలవరీ అయింది. బిహార్‌లో ఈఘటనకు సంబందించిన వీడియోనే వైరల్ అవుతోంది.
నెలలు నిండి పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని భర్త ఆసుపత్రికి తీసుకొస్తే వైద్య సిబ్బంది నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించారు. ఓవైపు ప్రసవ వేదనతో మహిళ ఆటోలో అవస్థలు పడుతుంటే నర్సులు టీ తాగుతూ ఫోన్లు చూసుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు. ఇదేంటని అడిగితే టీ తాగిన తర్వాత వస్తాం పోమ్మని చెప్పి గర్భిణి భర్తను పంపించారు. పురిటి నొప్పులు భరించలేకపోయిన గర్భిణి వచ్చిన ఆటోలోనే ఆసుపత్రి ముందు బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దయనీయ సంఘటన బిహార్( Bihar)లోని సుపాల్‌లో జరిగింది. సుపాల్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది ఈ ఘటన. సదర్ బ్లాక్‌లోని చైన్సింగ్పట్టి వార్డు నంబర్ 8లో నివాసముంటున్న వికాస్కుమార్ (Vikas Kumar) గర్భిణి అయిన భార్య బబితాదేవి(Babita Devi)ని స్థానిక సుపాల్ సదర్ ఆసుపత్రి(Supal Sadar Hospital)కి ఆటోలో తీసుకొచ్చాడు. పురిటి నొప్పులు పడుతున్న మహిళకు వైద్యం చేయమని మెటర్నిటీ వార్డు (Maternity ward)లో డ్యూటీ చేస్తున్న నర్సులను కోరాడు. అందుకు వాళ్లు చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా .. అందరూ కలిసి ఫోన్లు చూసుకుంటూ కాలక్షేపం చేశారు. ఫోన్ చేస్తే వస్తున్నామని చెప్పారు. ఇంతలోనే పురిటి నొప్పులు మరింత పెరగడంతో బబితాదేవి ఆటోనే బిడ్డకు జన్మనిచ్చింది.
రోగి కంటే టీ ఎక్కువంట..
ఓ గర్భిణి అభాగ్యురాలి మాదిరిగా ఆసుపత్రి ఆవరణలో ఆటోలో ప్రసవించడం స్థానిక మీడియా కంటపడింది. ఇదేమైనా పద్దతా అంటూ నర్సులను నిలదీసేందుకు వెళితే వాళ్లంతా హాయిగా టీలు తాగుతూ ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారు. నర్సుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మీడియా ప్రతినిధులు ట్రీట్మెంట్ అందించమని గట్టిగా చెప్పారు. బాధితురాలి భర్త వికాస్కుమార్ కూడా తాను చాలా సార్లు విజ్ఞప్తి చేశానని కాని వాళ్లు తన మాట పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీడియా ప్రతినిధుల హెచ్చరికలతో వెంటనే అక్కడున్న నలుగురు నర్సులు ప్రసవించిన మహిళను మెటర్నెటీ వార్డుకు తరలించారు.
వేటు వేస్తారా లేక వదిలేస్తారా ..
ఆసుపత్రిలో రోగులకు సేవ చేయమంటే..సెల్ఫోన్లు పట్టుకొని సరదా చేస్తున్నారు నర్సులు. కడుపులో బిడ్డను మోస్తూ పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు జరిగిన అవమానంపై స్థానిక మీడియా ప్రతినిధులు, బాధితురాలి భర్త విషయాన్ని డాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈఘటనపై పూర్తి విచారణ జరిపింది..బాధ్యులైన నర్సులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.