హోమ్ /వార్తలు /క్రైమ్ /

Female Teacher: టీ తాగడానికని లేడీ టీచర్ ఇంటికెళ్లి ఎంత పనిచేశాడు.. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన వీడియో..!

Female Teacher: టీ తాగడానికని లేడీ టీచర్ ఇంటికెళ్లి ఎంత పనిచేశాడు.. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన వీడియో..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మహిళలపై అత్యాచారాలు, అమానుషాలు రోజురోజుకూ పెరిగి పోతుండటం ఆందోళన కలిగించే విషయం. అక్కడాఇక్కడా అని తేడా లేకుండా కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మగాళ్లు ఇంటాబయటా మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. కొందరైతే వావివరుసలు మరిచి కన్న కూతుళ్లపై అత్యాచారాలకు పాల్పడుతూ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

బీహార్: మహిళలపై అత్యాచారాలు, అమానుషాలు రోజురోజుకూ పెరిగి పోతుండటం ఆందోళన కలిగించే విషయం. అక్కడాఇక్కడా అని తేడా లేకుండా కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మగాళ్లు ఇంటాబయటా మహిళలను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. కొందరైతే వావివరుసలు మరిచి కన్న కూతుళ్లపై అత్యాచారాలకు పాల్పడుతూ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నారు. మానవ సంబంధాల మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చుతున్నారు. సమాజంలోకి వెళ్లి ఉద్యోగాలు చేసే మహిళలకూ ఈ బాధలు తప్పడం లేదు. తాజాగా.. బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది.

జిల్లాలోని కృష్ణగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా టీచర్‌పై తోటి టీచర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. బాధిత మహిళ ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. అదే స్కూల్‌లో టీచర్‌గా చేరిన ముంతాజ్ అన్సారీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ 2014 నుంచి ఆ స్కూల్‌లో టీచర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. టీచర్‌గా పనిచేస్తున్న సదరు మహిళ ఓ అద్దె ఇంట్లో ఒక్కతే నివాసం ఉంటోంది.

పెళ్లి చేసుకుందామని ఆమెను నమ్మించిన ముంతాజ్ అన్సారీ ఆమెతో పలుమార్లు శారీరకంగా కలిశాడు. అయితే.. పెళ్లి ప్రస్తావన తీసుకొస్తున్నప్పుడల్లా అతను రేపుమాపంటూ దాటవేశాడు. కానీ ఆమెతో శారీరక బంధాన్ని కొనసాగించేందుకు మాత్రం ఆసక్తి చూపించేవాడు. అతని ప్రవర్తన పట్ల కలత చెందిన బాధిత మహిళ కొన్నాళ్లుగా అతనిని దూరం పెట్టింది. అయితే.. అతను మాత్రం ఆమెతో పడక సుఖం కోసం వెంపర్లాడటం మానలేదు. సెప్టెంబర్ 27న కూడా ఆమె ఇంటికి టీ తాగుదామని వచ్చాననే వంకతో వెళ్లాడు. అయిష్టంగానే ఆమె టీ పెట్టి ఇచ్చింది. అయితే.. టీ తాగిన వెంటనే వెళ్లిపోకుండా ఆమె వద్దంటున్నా బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమెకు తెలియకుండా ఫోన్‌లో ఫొటోలు, వీడియో తీశాడు. ఆ వీడియోను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో కూడా ఆ వీడియో వైరల్ అయింది. దీంతో.. ఆమె తనపై జరిగిన అత్యాచారానికి సంబంధించి, నెట్‌లో వైరల్ అవుతున్న తన వీడియోకి సంబంధించి పోలీసులను ఆశ్రయించింది.

ఇది కూడా చదవండి: Newly Married: పెళ్లయి నాలుగు నెలలు... భర్త ఉన్నట్టుండి మిస్సింగ్.. చివరికి ఏం జరిగిందో ఊహించలేరు..!

తనతో పాటు స్కూల్‌లో పనిచేసే ముంతాజ్ అన్సారీ అనే వ్యక్తి తనపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడని, ఫొటోలు, వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడని కన్నీరుమున్నీరయింది. బాధిత మహిళ దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి కావడంతో పోలీసులు నిందితుడిపై అత్యాచారానికి పాల్పడిన కేసుతో పాటు ఎస్సీ-ఎస్టీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో నిందితుడి గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. ఈ మహిళా టీచర్‌కు తాను బ్యాచిలర్‌నని, పెళ్లి కాలేదని పరిచయం చేసుకున్న ముంతాజ్ అన్సారీకి ఇప్పటికే వివాహమైంది. అంతేకాదు, ఓ బిడ్డకు తండ్రి కూడా. అయితే.. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఫిర్యాదు చేసిన మహిళా టీచర్‌కు కూడా గతంలో వివాహమైంది. భర్తతో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో అతని నుంచి విడాకులు తీసుకుంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

First published:

Tags: Bihar, Crime news, Love affair, RAPE, Viral Video

ఉత్తమ కథలు