Fire Breaks Out At Railway Godown In North Delhi: ఉత్తర ఢిల్లీలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రతాప్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో సబ్జీ మండి వద్ద రైల్వే గోడౌన్ లో మంటలు వ్యాపించాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. 14 ఫైరింజన్ లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోనికి తీసుకుని వచ్చాయి. ప్రస్తుతం మంటలు అదుపులోనికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
#WATCH | Delhi: Fire breaks out in Railway godown at sabzi mandi, near Pratap Nagar Metro Station. A total of 14 fire tenders rushed to the site. Fire has been brought under control: Delhi Fire Service
(Video source: Delhi Fire Service) pic.twitter.com/QIG2f0rV8T
— ANI (@ANI) April 24, 2022
రైలు ప్రమాదాల చరిత్రలోనే అనూహ్య ఘటన ఆదివారం చెన్నై నగరంలో చోటుచేసుకుంది.
సాధారణంగా కొద్ది పాటి వేగంతో రైలు పట్టాలు తప్పినప్పుడు పక్కకు ఒరగడం, స్పీడు ఎక్కువగా ఉంటే బోగీలు ఒకదానిపై మరోటి పడిపోవడం తెలిసిందే. అయితే, ఇవాళ జరిగిన ప్రమాదంలో మాత్రం రైలు పట్టాలు తప్పి, ఏకంగా మీటరు ఎత్తున్న ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ప్లాట్ ఫామ్ ధ్వంసం కాగా, అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది.
వివరాలివి.. తమిళనాడు రాజధాని చెన్నైలో విరివిగా తిరిగే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ) లోకల్ రైళ్లకు సంబంధించి ఇవాళ ప్రమాద ఘటన జరిగింది. బీచ్ స్టేషన్ లో ఓ సబర్బన్ రైలు పట్టాలు తప్పి, ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చింది. చెన్నై వర్క్‌షాప్ నుంచి కోస్టల్ రైల్వేస్టేషన్ వెళ్తున్న సమయంలో నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో ప్లాట్‌ఫామ్ వైపు దూసుకురావడంతో అక్కడ ఉన్న వారంతా పరుగులు పెట్టారు.
‘షెడ్ లైన్ నుంచి రైలు 1వ నంబర్ ప్లాట్‌ఫారమ్ వైపునకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బీచ్ స్టేషన్ లో ప్లాట్‌ఫారమ్ 1 కొంత భాగం దెబ్బతినింది. రైలు ఖాళీగా ఉండటం, ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పినట్లయింద’ని ప్రత్యక్ష సాక్షులు, అధికారులు పేర్కొన్నారు. అయితే లోకో పైలట్(రైలు డ్రైవర్) మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఆదివారం సెలవు కావడంతో ప్రయాణికుల రద్దీ లేదని, గాయపడ్డ రైలు డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించామని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Fire Accident, India Railways