హోమ్ /వార్తలు /క్రైమ్ /

జొమాటో డెలివరీ బాయ్‌, ట్రాఫిక్ ఎస్‌ఐకి మధ్య చిల్లర గొడవ..అందుకోసమేనంట

జొమాటో డెలివరీ బాయ్‌, ట్రాఫిక్ ఎస్‌ఐకి మధ్య చిల్లర గొడవ..అందుకోసమేనంట

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Video viral: తమిళనాడులో నడిరోడ్డుపై జరిగిన ఓ చిన్న గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జొమాటో డెలవరీ బాయ్‌తో ట్రాఫిక్‌ ఎస్సై ఘర్షణ పడ్డాడు. ఇద్దరి మధ్య గొడవకు కారణమైన అంశం ఏమిటో తెలిసిన జనం అవాక్కయ్యారు.

ఇంకా చదవండి ...

నడి రోడ్డు. అంతా చూస్తున్నారు. ఓ ట్రాఫిక్ ఎస్‌ఐ(Traffic sub inspector) ..జొమాటో డెలివరీ బాయ్‌ (Zomato delivery boy)ని కొట్టాడు. ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడటమే కాకుండా అతని చెంప చెళ్లు మనిపించాడు. కాలుతో తన్నాడు. ఎస్సై ప్రవర్తనకు కోపంతో ఊగిపోయిన డెలివరీ బాయ్‌ ఎస్‌ఐపై తిరగబడ్డాడు. నడిరోడ్డుపై ఇద్దరు షర్టు కాలర్లు పట్టుకొని ఘర్షణ పడ్డారు. పబ్లిక్ ప్లేసులో ఇంత రచ్చ జరగడంతో అటుగా వెళ్తున్న వాళ్లంతా పోలీస్‌, డెలివరీ బాయ్‌ గొడవ పడుతున్న దృశ్యాల్ని షూట్ చేసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేశారు. జొమాటో డెలివరీ చేసే వ్యక్తి పేరు వెంకటేష్(Venkatesh). జొమాటో డెలివరీ బాయ్‌తో గొడవపడుతున్న వ్యక్తి ట్రాఫిక్‌ ఎస్సై పేరు ధర్మరాజు (Dharmaraju). జొమాటో డెలివరీ బాయ్‌ వెంకటేష్‌కి ఎస్సైతో గొడవ పడాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. జొమాటో డెలివరీ చేసేందుకు వచ్చిన వెంకటేష్‌ని ట్రాఫిక్ ఎస్సై వెహికల్‌ డాక్యుమెంట్లు (Vehicle documents)లేవన్న కారణంతో 600 రూపాయలు జరిమానా(600 Rupees fine) విధించారు. అది కట్టమని బైక్‌ని ఆపారు. ఆ విషయంలోనే జొమాటో డెలివరీ బాయ్‌ వెంకటేష్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఫైన్ కట్టకుండా తమను ఎదురు ప్రశ్నించాడన్న కోపంతో ఎస్సై వెంకటేష్‌ని చెంపపై కొట్టాడు. పోలీసుల ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన జొమాటో డెలివరీ బాయ్‌ ట్రాఫిక్ ఎస్సై చొక్కాకాలర్ పట్టుకొని గలాటాకు దిగాడు. తమిళనాడు(Tamil nadu)లోని విరుదునగర్(Virudhunagar) జిల్లా శ్రీవిల్లిపుత్తూర్‌(Srivilliputhur)లో జరిగిన ఈ ఘర్షణ స్థానికంగా కలకలం రేపింది.

గొడవ వెనుక అసలు కారణం..

అసలు విషయం ఏమిటంటే జొమాటో డెలివరీ బాయ్‌ వెంకటేష్‌తో ఎస్సై గొడవపడింది జరిమానా ఎందుకు కట్టాలని ప్రశ్నించినందుకే అని సీసీ ఫుటేజ్‌తో పాటు అక్కడి స్థానికులు రికార్డ్‌ చేసిన వీడియోల ద్వారా అందరికి తెలిసింది. కానీ పోలీసులు మాత్రం వెంకటేష్‌ దగ్గర కత్తి ఉందని..దాంతో తమను బెదిరించాడని అందుకే అతడ్ని అదుపులోకి తీసుకున్నామంటూ అతనిపై కేసు నమోదు చేశారు.

సామాన్యుడిపైన మీ దౌర్జన్యం..

పబ్లిక్‌కి సర్వీస్‌ చేయాల్సిన పోలీసులు ..నడిరోడ్డుపై ఓ చిరుద్యోగిని పట్టుకొని చితకబాదిన ఘటన తమిళనాడులో వైరల్‌ గా మారింది. అంతే కాదు పోలీసులు జొమాటో డెలివరీ బాయ్‌ని కొట్టడం, తిడుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అధికారం చేతిలో ఉంటే సామాన్యుల పట్ల ఇలాగేనా పోలీసులు ప్రవర్తించేది అంటూ నెటిజన్లు కాప్స్‌ను తప్పు పడుతున్నారు. ఈ వీడియో అన్నీ సోషల్ మీడియా గ్రూప్‌ల్లో పోస్ట్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఇలాంటి ఘటనలపై సీరియస్ యాక్షన్ తీసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

First published:

Tags: Tamil nadu, Traffic police, Zomato