హోమ్ /వార్తలు /క్రైమ్ /

Video : బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతి కేసులో కీలక మలుపు..కీలక వీడియో బయటికి

Video : బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతి కేసులో కీలక మలుపు..కీలక వీడియో బయటికి

సోనాలి ఫోగట్(ఫైల్ ఫొటో)

సోనాలి ఫోగట్(ఫైల్ ఫొటో)

Sonali Phogat Viral Video: హర్యానా(Haryana) చెందిన భారతీయ జనతా పార్టీ (BJP) నాయకురాలు, పాపులర్ టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్(Sonali Phogat) ఆగ‌స్టు 23వ తేదీన గోవా(Goa)లోని రిసార్ట్‌లో సోనాలి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Sonali Phogat Viral Video: హర్యానా(Haryana) చెందిన భారతీయ జనతా పార్టీ (BJP) నాయకురాలు, పాపులర్ టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్(Sonali Phogat) ఆగ‌స్టు 23వ తేదీన గోవా(Goa)లోని రిసార్ట్‌లో సోనాలి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. గోవా టూర్‌ కి వెళ్లిన సోనాలి ఫోగట్ సోమవారం రాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో మరణించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గోవా డీజీ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర గోవాలోని ఎస్టీ ఆంటోనీ ఆస్పత్రి నుంచి సోనాలి ఫోగట్ మృతి గురించి ఆగస్టు 23న పోలీసులకు సమాచారం అందింది. సోనాలి ఫోగట్ గుండెపోటుతో మరణించలేదని,ఆగస్టు 22న గోవాలో సోనాలి దిగినప్పటి నుంచి ఆమె వెంబడి ఉన్న సుధీర్ సగ్వాన్,సుఖ్విందర్ వాసీ అనే ఇద్దరు వ్యక్తులే సోనాలి ఫోగట్ ని అత్యాచారం చేసి చంపేశారని సోనాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. సోనాలి ఫోగట్ సోదరుడు రింకూ ధాకా ఫిర్యాదు మేరకు సుధీర్ సగ్వాన్,సుఖ్విందర్ వాసీని గోవా పోలీసులు అరెస్ట్ చేసి వారిపై ఐపీసీ సెక్షన్ 302(హత్య)కింద కేసు నమోదు చేశారు. గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం గురువారం ఉదయం సోనాలి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించింది. ఈ రిపోర్ట్ లో సోనాలి ఫోగట్ శరీరంపై అనేక మొద్దుబారిన గాయాలు ఉన్నట్లు తేలింది. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉందని నివేదిక పేర్కొంది.


అయితే ఈ కేసులో కీలక సీసీటీవీ వీడియో తాజాగా బయటకొచ్చింది. మరణానికి కొన్ని గంటల ముందు సోమవారం రాత్రి అంజునా బీచ్‌లోని కర్లీస్ రెస్టారెంట్ నుంచి సోనాలి ఫోగట్ బయటికొస్తున్నట్లు ఉన్న సీసీటీవీ ఫుటేజీలో ఆమె తనంతట తానుగా నడవలేకుండా ఉన్నట్లు కనిపిస్తోంది. తన ఇద్దరు సహచరులలో ఒకరైన సుధీర్ సాంగ్వాన్ సహాయంతో ఆమె రెస్టారెంట్ లో నుంచి బయటికొస్తున్నట్లు ఆ ఫుటేజీలో కనిపిస్తోంది. నార్త్ గోవా రెస్టారెంట్‌లో పార్టీ సందర్భంగా సుధీర్ సాంగ్వాన్ ఫోగట్‌ను బలవంతంగా "కొన్ని అసహ్యకరమైన పదార్ధాలు" కలిగి ఉన్న నీటిని తాగించేలా చేసిన దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు తెలిపారు, ఇది ఆమె మరణానికి కారణమై ఉంటుందని వారు పేర్కొన్నారు. ఆ ఫుటేజీలో ఫోగట్ తో ఆమె ఇద్దరు సహాయకులు కనిపించారని... ఆగస్ట్ 23 తెల్లవారుజామున 4.30 గంటలకు ఫోగట్‌ను రెస్టారెంట్ వాష్‌రూమ్‌కి తీసుకెళ్లి, ముగ్గురూ రెండు గంటల పాటు వాష్‌రూమ్‌లో ఉన్నారని తెలిపారు.Serial Conman: ఈడోరకం... పోలీసులకు దొరికిపోవడానికి జనాలను మోసం చేస్తాడుఆ తర్వాత కొద్దిసేపటికి ఆమెను వారిద్దరూ గ్రాండ్ లియోనీ అనే హోటల్‌కు తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. అక్కడ గుండెపోటుతో చనిపోయిందంటూ సెయింట్ ఆంథోనీ ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు. కాగా, రెస్టారెంట్ లో పార్టీలో నిందితులతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా ఉండి కేక్ కట్ చేస్తూ కనిపించారని, ఇద్దరినీ ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా,గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గురువారం పనాజీలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జస్పాల్ సింగ్ స్వయంగా ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు అప్పగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్ గురువారం తెలిపారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bjp, Crime news, Goa, Haryana, Viral Video

ఉత్తమ కథలు