కేఫ్ కాఫీ డే వీజీ సిద్ధార్థ ఆత్మహత్యపై అనుమానాలు రేకెత్తిస్తున్న అంశాలివే...?

సిద్ధార్థ అదృశ్యం అనంతరం బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ కు రాసిన లేఖగా చెలామణి అవుతున్న లేఖ అనుమానాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా సిద్ధార్థ చివరి లేఖగా భావిస్తున్న ఈ లేఖ జూలై 27న రాసినట్లుగా ఉంది. అయితే సిద్ధార్థ ఈ నెల 29 నుంచి అదృశ్యమయ్యారు.

news18-telugu
Updated: July 31, 2019, 10:38 AM IST
కేఫ్ కాఫీ డే వీజీ సిద్ధార్థ ఆత్మహత్యపై అనుమానాలు రేకెత్తిస్తున్న అంశాలివే...?
వీజీ సిద్దార్థ ఫైల్ ఫోటో
  • Share this:
కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ ఆకస్మిక మృతిపై పలు అనుమానాలకు తెరలేపింది. కాగా గత 24 గంటలుగా ఉత్కంఠకు రేపిన సిద్ధార్థ అదృశ్యం నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభించడంతో విషాదాంతంగా ముగిసింది. కాగా సిద్ధార్థ అదృశ్యం అనంతరం బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ కు రాసిన లేఖగా చెలామణి అవుతున్న లేఖ అనుమానాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా సిద్ధార్థ చివరి లేఖగా భావిస్తున్న ఈ లేఖ జూలై 27న రాసినట్లుగా ఉంది. అయితే సిద్ధార్థ ఈ నెల 29 నుంచి అదృశ్యమయ్యారు. అయితే సిద్ధార్థ అదృశ్యమవడానికి సోషల్ మీడియాలో సిద్ధార్థదిగా చెలామణి అవుతున్న లేఖకు మధ్య రెండు రోజుల తేడా ఉంది. దీంతో ఆ లేఖ రాసింది అసలు సిద్ధార్థనేనా...కాదా అనేది తేలాల్సి ఉంది. అయితే సిద్ధార్థ మృతిపై సమగ్ర విచారణ జరపాలని కర్ణాటక కాంగ్రెస్ నేత డికె. శివకుమార్ డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు సిద్ధార్థ మృతికి ఆయన కంపెనీ చేసిన అప్పులకే కారణమని కొన్ని వాదనలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ వాదనలకు, వాస్తవ పరిస్థితికి మధ్య పొంతన కుదరడం లేదు. నిజానికి ఆయన కంపెనీ అప్పులతో పోల్చి చూస్తే ఆయన ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆత్మ హత్య చేసుకోవాల్సిన అవసరమే లేదని ఆయన సన్నిహితులు వాదిస్తున్నారు.

అసలు సఖిలేష్ పూర్ వెళ్లాల్సిన సిద్ధార్థ సడెన్ గా మనసు మార్చుకొని మంగుళూరు ఎందుకు వెళ్లినట్లు అనేది శేషప్రశ్నగా మిగిలింది. అలాగే నేత్రావతి నది బ్రిడ్జి వద్ద సిద్ధార్థ చివరి సారి ఎవరితో ఫోన్ మాట్లాడారు అనేది దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. దీంతో పోలీసుల ప్రాథమిక దర్యాప్తు పూర్తి అయితే కానీ అసలు విషయాలు బయటపడే అవకాశాలు లేవని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

First published: July 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు