హోమ్ /వార్తలు /క్రైమ్ /

Married Woman: భర్త స్నేహితుణ్ని అన్ననుకుంది.. కానీ వాడి ఉద్దేశం వేరు.. చివరికి జరిగింది వేరు!

Married Woman: భర్త స్నేహితుణ్ని అన్ననుకుంది.. కానీ వాడి ఉద్దేశం వేరు.. చివరికి జరిగింది వేరు!

మృతురాలు మౌనిక

మృతురాలు మౌనిక

స్నేహితుడి భార్యను కామదృష్టితో చూస్తూ, ఆ ఇంట్లో అతనికుండే ప్రయారిటీని అడ్డంపెట్టుకొని ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడో నీచుడు. చివరికి ఆ ఇద్దరూ తీసుకున్న నిర్ణయాలు రెండు కుటుంబాల్లో పసిపిల్లలను ఆల్మోస్ట్ అనాథలుగా మార్చాయి.

స్నేహితుడి భార్యను సోదరిగా భావించడం మనకు రాసుకోని రాజ్యాంగంలాంటిది. అలాంటి పిలుపులు, ప్రేమపూర్వక ఆప్యాయతలు మనందరికీ అనుభవమే. అయితే మనుషులందు కీచకులు వేరు అన్నట్టు, స్నేహితుడి భార్యను కామదృష్టితో చూస్తూ, ఆ ఇంట్లో అతనికుండే ప్రయారిటీని అడ్డంపెట్టుకొని ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడో నీచుడు. చివరికి ఆ ఇద్దరూ తీసుకున్న నిర్ణయాలు రెండు కుటుంబాల్లో పసిపిల్లలను ఆల్మోస్ట్ అనాథలుగా మార్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలివి..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన వివాహిత మౌనిక(24) ఇద్దరు పిల్లలున్నారు. భర్త, అత్తమామలతో కలిసి హాయిగా సాగుతోన్న ఆమె జీవితంలోకి భర్త స్నేహితుడి రూపంలో సమస్యలు మొదలయ్యాయి. భర్త స్నేహితుడు, అదే గ్రామానికి చెందిన మోటపల్కుల ప్రశాంత్(28) చాలా కాలంగా మౌనికను వేధిస్తూవచ్చాడు. ప్రశాంత్ కు పెళ్లయి, పిల్లలు ఉన్నా నీచ బుద్దితో స్నేహితుడి భార్యనూ లోబర్చుకోవాలనుకున్నాడు.

Shocking: మ‌హిళ గొంతులో ఇరుక్కుపోయిన టూత్‌బ్ర‌ష్‌.. దాన్ని తీయడానికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది!


తన అత్తిట్లో అందరూ గౌరవించే, భర్త ఎంతగానో అభిమానించే స్నేహితుడైన ప్రశాంత్ నుంచి విపరీతమైన వేధింపులు ఎదుర్కొన్న మౌనిక ఆ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలీక రోజులపాటు నరకయాతన అనుభవించింది. ప్రశాంత్ వేధింపులు తాళలేని స్థితిలో మౌనిక ఈనెల 5న పురుగుల మందుతాగేసింది. అత్త, భర్త, తల్లి కలిసి ఇంటి ముందు మాట్లాడుకుంటుండగా, లోపల మౌనిక పురుగుల మందు తాగి వాంతులు చేసుకుంటూ బయటికొచ్చి పడిపోయింది. ఇది గమనించిన కుటుంబీకులు హుటాహుటిన లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆమెను కరీంనగర్ పెద్దాసుపత్రికి తరలించారు. కానీ,

ఆత్మహత్యకు పాల్పడిన నిందితుడు ప్రశాంత్

రైతులకు శుభవార్త : ఆ రుణాలన్నీ మాఫీ -రూ. 16,144 కోట్ల భారం తగ్గినట్లే -సాగుకు భారీగా నిధులు


భర్త స్నేహితుడి వేధింపులు భరించలేక ఈనెల 5న పురుగుల మందు తాగిన మౌనిక చికిత్స పొందుతూ సోమవారం(ఈనెల 7న) ప్రాణాలు కోల్పోయింది. మరణశయ్యపైనే తన బాదను తల్లితో చెప్పుకున్నట్లు వెల్లడైంది. మృతురాలి తల్లి సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. వేదింపుల వల్లే మౌనిక చనిపోయిందని, ఈ మేరకు కేసు కూడా నమోదైందని తెలిసిన వెంటనే నిందితుడు ప్రశాంత్ వణికిపోయాడు. ఊర్లో తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేక, ఘటనను అవమానంగా భావించి ప్రశాంత్ సోమవారం నాడే రామగుండం దగ్గర రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశాంత్ కు ఏడాది పాప, మౌనికకు ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

Published by:Madhu Kota
First published:

Tags: Adilabad, Mancherial, Married women, Sexual harrassment

ఉత్తమ కథలు