షాద్ నగర్ నిర్భయ ఘటన : ఆమె వర్సిటీలో ఎలా ఉండేదో చెప్పిన ప్రొఫెసర్

వర్సిటీలో ఆమెపై సింగిల్ రిమార్క్ కూడా లేదని ప్రొఫెసర్ రామ్ సింగ్ చెప్పారు. ఆమె చాలా రిజర్వ్‌గా ఉండేదని.. తన పనేదో తాను చూసుకునే వెళ్లిపోయే మనస్తత్వం అని చెప్పారు.

news18-telugu
Updated: December 1, 2019, 3:39 PM IST
షాద్ నగర్ నిర్భయ ఘటన : ఆమె వర్సిటీలో ఎలా ఉండేదో చెప్పిన ప్రొఫెసర్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలో జరిగిన వెటర్నరీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఆమె చదువుకున్న వెటర్నరీ వర్సిటీ ప్రొఫెసర్స్ స్పందించారు. ఆమె చాలా సౌమ్యురాలని, సున్నిత మనస్కురాలని ప్రొఫెసర్ రామ్ సింగ్ తెలిపారు. వర్సిటీలో ఆమెపై సింగిల్ రిమార్క్ కూడా లేదని అన్నారు. ఆమె చాలా రిజర్వ్‌గా ఉండేదని.. తన పనేదో తాను చూసుకునే వెళ్లిపోయే మనస్తత్వం అని చెప్పారు.చాలామంది స్టూడెంట్స్ క్యాంపస్‌లోనే ఉండి చదువుకుంటారని.. కానీ ఫుడ్ సమస్య,హోమ్ సిక్ కారణంగా ఆమె ఇంటి నుంచే వర్సిటీకి వచ్చి వెళ్తుండేదన్నారు. చదువులోనూ చురుగ్గా ఉండేదని.. ఏ డౌట్ ఉన్నా అడిగి తెలుసుకునేదని అన్నారు. టీఎస్పీఎస్సీ మెరిట్ ద్వారా కొల్లూరులో వెటర్నరీ డాక్టర్‌గా ఉద్యోగం పొందిందన్నారు. ఆమె పనిచేస్తున్న గ్రామంలోనూ మంచి పేరు తెచ్చుకుందని తెలిపారు.అలాంటి మనిషి లేకుండా పోయిందంటే కన్నీళ్లు ఆగడం లేదన్నారు.

కాగా, షాద్ నగర్‌ సమీపంలో జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు తీవ్ర స్థాయిలో స్పందించారు. నిందితులను ఉరితీయాలన్న డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నలుగురు నిందితులు చర్లపల్లి జైల్లో రిమాండ్‌‌లో ఉన్నారు. షాద్ నగర్ మెజిస్ట్రేట్ వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితులకు ఎలాంటి తీర్పు పడుతుందోనని దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>