హోమ్ /వార్తలు /క్రైమ్ /

Visakhapatnam: విశాఖలో ఇంజనీర్ దిమిత్రి మృతి .. రష్యాలో విషాదం.. ఇంతకీ ఏం జరిగింది?

Visakhapatnam: విశాఖలో ఇంజనీర్ దిమిత్రి మృతి .. రష్యాలో విషాదం.. ఇంతకీ ఏం జరిగింది?

విశాఖలో రష్యా ఇంజనీర్ మరణం

విశాఖలో రష్యా ఇంజనీర్ మరణం

విశాఖలో విషాదం నెలకొంది. నౌకాదళంలోని జలంతర్గామి నౌకలో సాంకేతిక లోపాలను సరిచేసేందుకు వచ్చిన ఓ ఇంజనీర్.. పనులు చేస్తుండగానే గుండెపోటుతో మరణించారు.

విశాఖలోని నావికాదళంలో అనుకోని పరిణామం పెను విషాదాన్నా నింపింది. భారత నౌకాదళానికి చెందిన ఓ కీలక జలాంతర్గామిలో సాంకేతిక లోపం ఏర్పడింది. కొన్ని రోజుల నుంచి ఆ లోపాన్ని గుర్తించడం కష్టంగా మారింది. చాలామంది ఇంజినీర్లు ప్రయత్నించినా జలంతర్గామిలో లోపాలను గుర్తించలేక చేతులెత్తేశారు. దీంతో దీనిపై అత్యంత అనుభవం ఉన్న గ్రాచవ్ దిమిత్రికి ఆ పనిని అప్పగించారు అధికారులు. అయితే ఆయన జలంతర్గామిలో మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారి గుండెనొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని ఐ.ఎన్.ఎస్ కళ్యాణి ఆసుపత్రికి తరలించారు. ఆక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు దిమిత్రి. దీంతో భారత నావికాదళంలోనే కాదు రష్యాలను విషాదం నెలకొంది..

జలాంతర్గామిలో లోపాలను సరిచేసేందుకు ఇక్కడి ఇంజనీర్లు చేసిన ప్రయత్నాలు విఫలం అవ్వడంతో.. వాటికి సంబంధించి అనుభవం ఉన్న ఇంజనీర్ 43 ఏళ్ల గ్రాచవ్ దిమిత్రిను రష్యా నుంచి విశాఖకు రప్పించారు. ఇక్కడి అధికారుల పిలుపుతో దిమిత్రి ఫిబ్రవరి 27న విశాఖ వచ్చారు. యారాడలోని డాల్ఫిన్ హిల్స్ ప్రాంతంలోని క్వార్టర్స్‌లో ఆయన ఉంటున్నారు. అయితే ఇలా మన నౌకలోని సంకేతిక లోపాలను సరిదిద్దడానికి వచ్చిన ఇంజనీర్ మరణంతో.. నావికాదళంలో పెను విషదానికి గురైంది. వెంటనే విషయాన్ని రష్యాలో ఉన్నవారి కుటుం సభ్యులకు తెలియజేశారు అధికారులు..

సాధారణంగా ఇండియన్‌ నేవీకి చెందిన సబ్‌మెరైన్‌ నౌకలో ఎప్పుడైనా సాంకేతిక లోపాలు ఏర్పడితే వాటిని స్థానిక ఇంజనీర్లే మరమ్మత్తులు చేస్తుంటారు. కానీ కొన్ని నౌకల్లో మాత్రం సాంకేతిక లోపాలు సరిచేయడానికి ప్రత్యేక అనుభం ఉన్నవారే ఉంటాలి. దీనిలో భాగంగా ఆయనను రష్యా నుంచి రప్పించాల్సి వచ్చింది. దిమిత్రి విశాఖకు వచ్చిన దగ్గర సాంకేతిక లోపాలను సరిదిద్దడంపైనే 24 గంటలు ఫోకస్ పెట్టారు. ఇక తను వచ్చిన పని త్వరలో పూర్తి అవుతోంది అనుకునే సయయంలో ఇలా విషాదం నెలకొంది. ఆయన నౌకలోని మరమ్మత్తు పనిలో ఉండాగానే సడెన్ గా కుప్పకూలిపోయారు. నేవల్‌ అధికారుల ఫిర్యాదు మేరకు మల్కాపురం సీఐ కూన దుర్గాప్రసాద్‌ దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల నుంచి పూర్తి వివారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు

నేవీ అధికారులు ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. భారత దేశం కోసం వచ్చి ప్రాణాలు విడవం బాధగా ఉందని.. అన్ని అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేసి.. ఇంజనీర్ కు వందనాలు చేస్తూ.. నివాళులర్పించారు. విషాద ఘటనపై పూర్తి వివరాలను వెంటనే ఉన్నతాధికారులు అందజేసి.. రష్యాలోని నేవీ విభాగం వారికి సమాచారం అందించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Indian Navy, Visakha, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు