Vehicle Runs Over 6 Year Old Girl : మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఆరేళ్ల బాలికపై నుంచి పికప్ వాహనం దూసుకెళ్లింది. దీంతో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలోని బర్జార్ క్రాసింగ్ వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆ వాహనానికి నిప్పుపెట్టారు. 43 ఏళ్ల డ్రైవర్ మగన్ సింగ్ ను దారుణంగా కొట్టారు. వాహనానికి నిప్పంటించి, మంటల్లోకి అతడిని తోసేశారు. ఈ ఘటనలో డ్రైవర్ కు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు..కాలిన గాయాలతో ఉన్న డ్రైవర్ ని మెరుగైన ట్రీట్మెంట్ కోసం గుజరాత్‌లోని దాహోద్ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం అతడు మరణించాడని అలీరాజ్‌పూర్ జిల్లా ఎస్పీ సఖారామ్ సెంగార్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Died, FIRE, Madhya pradesh