Home /News /crime /

బ్రేక్ ఇన్‌స్పెక్టర్ అరాచకాలు.. ఆటో డ్రైవర్ల ఆందోళన

బ్రేక్ ఇన్‌స్పెక్టర్ అరాచకాలు.. ఆటో డ్రైవర్ల ఆందోళన

బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌కి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వాహనదారులు

బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌కి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వాహనదారులు

బ్రేక్ ఇన్‌స్పెక్టర్ లంచాలు కావాలంటూ పీడించుకు తింటున్నారని వాహనదారులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు.

    ప్రకాశం జిల్లా కందుకూర్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఆటో డ్రైవర్ల వద్ద లంచాలు తీసుకుంటున్నారని కందుకూర్ బ్రేక్ ఇన్స్పెక్టర్ కిరణ్ ని వాహనదారులు అడ్డుకున్నారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ కార్లో కూర్చొని డ్రైవర్ ద్వారా లంచాలు వసూలు చేయిస్తూ తమను అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆటో డ్రైవర్లు ఆరోపించారు. బ్రేక్ ఇన్‌స్పెక్టర్ కారును అడ్డుకున్నారు. గొర్రెల లోడ్‌ తీసుకెళుతున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి లైసెన్సు, ట్యాక్స్ అన్నీ ఉన్నా రూ.1,500 లంచం తీసుకున్నారని ఆందోళన చేశారు. ఓ దశలో వాహనదారులు ఎన్టీఆర్ సర్కిల్ చేరుకొని కారు, రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ లంచం తీసుకున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీయబోతే, అతని వద్ద సెల్ ఫోన్ లాక్కుని విసిరిపడేశాడు. అయితే, వాహనదారుల ఆరోపణలు అవాస్తవం అని బ్రేక్ ఇన్స్పెక్టర్ కిరణ్ అన్నారు.
    First published:

    Tags: Andhra Pradesh, Ongole, Prakasham dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు