ఆరేళ్ల చిన్నారి కళ్లెదుటే తండ్రి దారుణ హత్య ... పాయింట్ బ్లాంక్‌తో కాల్చి..

శుక్రవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో తన ఆరేళ్ల కుమారుడు, స్నేహితుడితో కలిసి బైక్ పై తన సోదరి ఇంటి నుంచి తన ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. మధ్యలో కూరగాయల మార్కెట్ వద్ద తనతో పాటు వచ్చిన స్నేహితుడు బండి దిగిపోయాడు.

news18-telugu
Updated: August 25, 2019, 1:10 PM IST
ఆరేళ్ల చిన్నారి కళ్లెదుటే తండ్రి దారుణ హత్య ... పాయింట్ బ్లాంక్‌తో కాల్చి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కన్న బిడ్డ కళ్లెదుటే కన్నతండ్రిని దారుణంగా హతమార్చిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.తన తండ్రితో కలిసి సరదాగా బండిపై వస్తున్న చిన్నారికి భయాంకరమైన పరిస్థితి ఎదురైంది. తన తండ్రితో ఏం జరుగుతుందో కూడా తెలియని ఆ పసిమొగ్గ కళ్లెదుటే... తండ్రి ప్రాణాలు పోయాయి. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... ఫజ్లూ తన భార్య కొడుకుతో కలిసి ఢిల్లీలోని ఓక్లా ప్రాంతంలో నివసిస్తున్నారు. ఫజ్లూ కూరగాయల వ్యాపరి. శుక్రవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో తన ఆరేళ్ల కుమారుడు, స్నేహితుడితో కలిసి బైక్ పై తన సోదరి ఇంటి నుంచి తన ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. మధ్యలో కూరగాయల మార్కెట్ వద్ద తనతో పాటు వచ్చిన స్నేహితుడు బండి దిగిపోయాడు. అతడు మార్కెట్ లోపలికి వెళ్లిపోగానే... ఫజ్లూ బైక్ స్టార్ట్ చేసుకొని ఇంటిదారి పట్టాడు.

ఇంతలో అకస్మాత్తుగా ముఖాలకు హెల్మెట్లు ధరించిన కొందరు వ్యక్తులు ఫజ్లూ బైక్‌ను చుట్టుముట్టారు. అతని ముఖంపై గన్ పెట్టి కాల్పులకు దిగారు. ముందుగా తలపై గన్‌తో కాల్చారు. ఆ తర్వాత పారిపోతూ మరోసారి మెడపై కూడా కాల్పులకు దిగబడ్డారు. ఈఘటనలో ఫజ్లూను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ దాడిలో గాయాలపాలైన ఫజ్లూ కుమారుడుని చికిత్స నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.  మరోవైపు పోలీసులు పాతకక్షల నేపథ్యంలోనే ఫజ్లూను హత్య చేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>