హోమ్ /వార్తలు /క్రైమ్ /

Krishna River: కృష్ణానదిలో విషాదానికి కారణం ఇదే.. వారి కుటుంబాలకు అండగా శారదా పీఠం

Krishna River: కృష్ణానదిలో విషాదానికి కారణం ఇదే.. వారి కుటుంబాలకు అండగా శారదా పీఠం

వేద విద్యార్థుల ప్రమాదానికి కారణం ఇదే

వేద విద్యార్థుల ప్రమాదానికి కారణం ఇదే

Krishna River; కృష్ణా నదిలో వేద పాఠశాల ఉపాధ్యాయుడు, మరో ఐదుగురు విద్యార్థులు గల్లంతైన ఘటనకు కారణం ఇదే అంటున్నారు స్థానికులు.. వారి నిర్లక్ష్యం విద్యార్థులను బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ విద్యార్థుల కుటుంబాల బాధ్యతను తాము తీసుకుంటామని శారదా పీఠం ప్రకటించింది.

ఇంకా చదవండి ...

Six students and a teacher drowned:  గుంటూరు జిల్లా (Guntur District) అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం నెలకొంది. కృష్ణానది (Krishna River)లో స్నానానికి దిగి  ఐదుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం నెలకొంది. నదిలో స్నానానికి దిగిన వారంతా గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారు మాదిపాడు వేదపాఠశాల విద్యార్థులుగా గుర్తించారు. గల్లంతైన వెంటనే స్థానికులు  అప్రమత్తమై మృతదేహాలను  వెలికితీశారు , మరో ఒకరి కోసం గాలింపు కొనసాగుతోంది.  గల్లంతైన విద్యార్థులు స్థానిక వేద పాఠశాలకు చెందిన వారిగా గుర్తించారు.

మాదిపాడు గ్రామంలో గల వేద పాఠశాల నందు చదువుకొనుచున్న 14 ఏళ్ల శివ శర్మ,   ఆయన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) నుంచి ఇక్కడకు వచ్చారు.  15 ఏళ్ల నితీష్ కుమార్ దీక్షిత్, ఉత్తర ప్రదేశ్ (Uttarapradesh) నుంచి వచ్చారు. 15 ఏళ్ల  హర్షిత్ శుక్లది కూడా ఉత్తర్ ప్రదేశ్ నే. 17 ఏళ్ల  శుభం  త్రివేది కూడా ఉత్తర ప్రదేశ్ నుంచే వచ్చారు.  14 ఏళ్ల అన్షునం శుక్లా కూడా అదే రాష్ట్రానికి చెందిన వారే. ఇక   వేద పాఠశాల ఉపధ్యాయుడు 24 ఏళ్ల  సుబ్రహ్మణ్యం స్థానికంగా  నరసరావుపేటకు చెందినాయనే..

ఇదీ చదవండి: వైభవంగా మంత్రి బొత్స కుమారుడి ఎంగేజ్ మెంట్..? మెగాస్టార్ సహా ప్రముఖుల హాజరు

ఒక టీచరు... 5గురు విద్యార్ధులు స్నానం చేయడం కోసం శుక్రవారం  సాయంత్రం సుమారు  5-30 ని. ల సమయములో మాదిపాడు వద్ద కృష్ణా నదిలో దిగి ప్రమాద వశాత్తు నదిలోపడి చనిపొయినారు.  అయితే వీరి ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు స్థానికులు.. అసలు అది చాలా ప్రమాదకరమైన ప్లేస్ అని గుర్తించారని.. అక్కడ స్నానాలను నిషేదించాలని.. గతంలో సంఘటనలు జరిగినా అధికారులు కనీసం హెచ్చరిక బోర్డు పెట్టలేదు అంటున్నారు. అందుకే ఈ ప్రమాధానికి నిర్లక్షమే ప్రధాన కారణమంటున్నారు.

ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడి భారీ కానుక.. విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

కృష్ణా నదిలో స్నానం ఆచరిస్తుండగా గుంతలో పడిన విద్యార్థిని రక్షించే ప్రయత్నంలో ఐదుగురు విద్యార్థులు, గురువు అశువులు బాశారు. ఒకరికొకరు చేతులు పట్టుకుని బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇంతలో ఒక్కసారిగా గుంతలో పడి మృతి చెందారు. ఒకరికొకరు సాయంగా చేతులు పట్టుకోగా లోతు తెలియని గుంత అందరినీ మృత్యు ఒడికి లాగేసింది. అచ్చంపేట, సత్తెనపల్లి సీఐలు భాస్కరరెడ్డి, నరసింహారావు, ఎస్‌ఐ మణికృష్ణ చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులు కాసేపట్లో చేరుకోనున్నారు..


ఇదీ చదవండి: ఆ ఇద్దరినీ కలిపిన వివాహ వేడుక.. నారా-దగ్గుబాటి ఒక్కటయ్యేనా..?

మరోవైపు ఈ  వేద విద్యార్థుల విషాదంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు.  వేద పాఠశాల విద్యార్థుల విషాద వార్త కంటతడి పెట్టించింది అన్నారు.  మృతుల కుటుంబాలను విశాఖ శ్రీ శారదాపీఠం ఆదుకుంటుంది అన్నారు  స్వరూపానందేంద్ర స్వామి. 50 వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తామన్నారు.   మిగిలిన విద్యార్థులను తమ వేద పాఠశాలలో చదివించడానికి తాము సుముఖంగా ఉన్నామన్నారు స్వరూపనందేద్ర స్వామి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

ఉత్తమ కథలు