హోమ్ /వార్తలు /క్రైమ్ /

అమ్మాయిల కత్తిలాంటి ఐడియా.. కామాంధులు దగ్గరకొస్తే ఫసక్...

అమ్మాయిల కత్తిలాంటి ఐడియా.. కామాంధులు దగ్గరకొస్తే ఫసక్...

Photo: IANS

Photo: IANS

దేశంలో మహిళలు, యువతులు, బాలికలు అనే తేడా లేకుండా ఆడవాళ్లపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఏ మూలకెళ్లినా ఇవి ఆగడం లేదు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అందులోని లోపాలను ఆసరాగా తీసుకుని దుండగులు బయటపడుతున్నారు.

 • News18
 • Last Updated :

  భారత్ లో ఆడవారిపై లైంగికదాడులను నియంత్రించడానికి ఎన్ని చట్టాలను తీసుకొస్తున్నా.. అవి వారికి రక్షణ కల్పించడంలో విఫలమవుతూనే ఉన్నాయి. చట్టాల లోని లోపాల కారణంగా కామాంధులు.. ఏం చేసినా చెల్లుతుందిలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నాటి నిర్భయ నుంచి నేటి హత్రాస్ వరకూ జరుగుతుందిదే. అయితే మారుతున్న కాలానికి తగ్గట్టు మహిళల రక్షణ వారి చేతుల్లోనే ఉంది. లైంగిక వేధింపులు, నేరాలు పెరిగిన దృష్ట్యా... ఆత్మరక్షణ చేసుకోవాల్సిందే. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి చెందిన ఇద్దరు బాలికలు.. స్మార్ట్ కత్తిని కనుగొన్నారు. ఆకతాయిలెవరైనా మహిళలను బలత్కరించే సమయంలో.. అపర భద్రకాళిలా వారిని చీల్చి చెండాడొచ్చు. అంతే కాదండోయ్.. ! ఇందులో ఉండే సిమ్ వల్ల వారి కుటుంబ సభ్యులు, పోలీసులకు మెసేజ్ కూడా వెళ్తుంది.

  వివరాల్లోకెళ్తే... వారణాసిలోని అశోక ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ లో ఇంటర్ చదువుతున్న షాలిని, దీక్షలు ఈ స్మార్ట్ కత్తిని తయారుచేశారు. 70 గ్రాముల బరువుండే ఈ స్మార్ట్ కత్తిని ఆభరణంగా గానీ, లేదా బ్యాగులో గానీ పెట్టుకోవచ్చు. ఉక్కుతో తయారుచేసిన ఈ కత్తి.. ఒక ఆభరణం మాదిరిగా ఉంటుంది. దానిని ఓపెన్ చేస్తే కత్తి కనిపిస్తుంది. అందులోనే ఒక సిమ్ స్లాట్ ను కూడా అమర్చారు. దాన్లో సిమ్ ను అమర్చారు. బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్ ఆయుధంతో అక్కడికక్కడ వారిని రక్షించుకోవచ్చు. అంతేగాక దానికి ఉండే చిన్న బటన్ ను నొక్కడం ద్వారా.. ముందుగా ఆ సిమ్ లో సేవ్ చేసుకున్న కుటుంబ సభ్యులకు గానీ, స్థానిక పోలీసులకు గానీ బాధితురాలు ఎక్కడున్నదనే విషయం తెలిసిపోతుంది. వారు వచ్చేసరికి కత్తిని ఆయుధంగా కూడా వాడుకోవచ్చు.

  ashoka institute of computer science, crimes against women, diksha, shalini, self defence, varanasi, uttarapradesh, women safety, women security, smart knife
  Photo : IANS

  ఉక్కుతో తయారుచేసిన ఈ కత్తి బరువు 70 గ్రాములు. ఆ కాలేజీ రీసెర్చి అండ్ డెవలప్ మెంట్ హెడ్ గా ఉన్న శ్యామ్ చౌరాసియా మార్గదర్శకత్వంలో దీనిని తయారు చేసినట్టు బాలికలు తెలిపారు. ఆభరణంలా ఉండే ఈ స్మార్ట్ కత్తికి ధర కూడా తక్కువే నిర్ణయించారు. మహిళలకు ఆత్మరక్షణగా నిలిచే ఈ స్మార్ట్ కత్తి వెల రూ. 1,500 మాత్రమే.

  గడప దాటి అడుగు బయటపెట్టిన మహిళలు.. ఇంటికి సేఫ్ గా తిరిగి వస్తారో.. రారో అనే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ప్రతి మహిళకు ఇలాంటి ఆయుధాలు రక్షణగా నిలుస్తాయి. లైంగికదాడులను అరికట్టాలంటే ఇలాంటి ఆవిష్కరణలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది. ఏదేమైనా.. ఇంత చిన్న వయసులోనే మంచి ఆవిష్కరణ చేసిన షాలిన, దీక్షలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Crime, Harassment on women, Varanasi

  ఉత్తమ కథలు