Home /News /crime /

VALENTAINES DAY MURDER IN ZAHEERABAD AN INTER STUDENT ALLEGEDLY RAPED AND MURDERED BY LOVER IN SANGAREDDY DISTRICT MKS

Zaheerabad: ప్రేమికుల రోజు ఏకాంతమంటూ దారుణం.. దిండ్లు పేర్చి నిద్రపోతున్నట్లు నమ్మించి!!

మృతురాలు

మృతురాలు

ప్రేమికుల రోజు(valentaines day) ఏకాంతంగా గడుపుదామంటూ ప్రియుడు ఒత్తిడి చేయడంతో ఇంట్లో వాళ్లకు మస్కాకొట్టి వెళ్లిన ఇంటర్ విద్యార్థిని అతని చేతిలోనే దారుణ హత్యకు గురైంది. అత్యాచారం కూడా జరిగుంటుందని పోలీసులు భావిస్తున్నారు..

ప్రేమికుల రోజు(valentaines day) ఏకాంతంగా గడుపుదామంటూ ప్రియుడు చెప్పిన మాయమాటలు నమ్మి వెళ్లిన ఇంటర్ విద్యార్థిని (16).. అతని చేతిలో అత్యాచారానికి, హత్యకు గురైంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ దారుణం జరిగింది. ప్రేమికుల రోజు(సోమవారం) మధ్యాహ్నానానికి గానీ గ్రామ శివారు మామిడితోటలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటనపై జహీరాబాద్ డీఎస్పీ శంకర్‌రాజు, సీఐ రాజశేఖర్‌ మీడియాకు వెల్లడించిన వివరాలివి..

సంగారెడ్డి జిల్లాలో ఓ ఇంటర్‌ విద్యార్థిని హత్యకు గురైంది. జహీరాబాద్‌ మండలంలోని హుగ్గెల్లి గ్రామానికి దగ్గర్లో మామిడి తోటలో సోమవారం మధ్యాహ్నం ఓ బాలిక మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు పోలీ సులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. గొంతుకు చున్నీ బిగించి బాలికను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హుగ్గెల్లికి చెందిన బుజ్జమ్మ భర్త 15 ఏళ్ల కిందట చనిపోయాడు. దీంతో కూలీ పనులు చేస్తూ కొడుకు సురేశ్, కుమార్తె మౌనిక (16)ను పోషిస్తోంది.

CM KCR: కాంగ్రెస్‌తో పొత్తుపై కేసీఆర్ కుండబద్దలు -ఆ విషయంలో Rahul Gnadhiకి కడదాకా మద్దతు


మౌనిక జహీరాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం తల్లి డ్వాక్రా గ్రూపు సమావేశానికి వెళ్లి రాత్రి 11.30 గంటలకు ఇంటికి చేరింది. ఆమె రాకముందే మౌనిక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తల్లికి అనుమానం రాకుండా మంచంపై దిండ్లు పేర్చి, దుప్పటి కప్పి నిద్రపోతున్నట్లు భ్రమింపజేసింది. కుమార్తె పడుకొనే ఉంటుందని భావించిన తల్లి మరో గదిలో నిద్రకు ఉపక్రమించింది. అయితే కుమార్తె పడుకున్న చోట నుంచి ఎంతకీ కదలకపోవడంతో అనుమానం వచ్చి తల్లి, సోదరుడు పరిశీలించగా మౌనిక అక్కడ లేదని అర్థమైంది.

Surgical strike ఆధారాలివిగో : ఆర్మీని బద్నాం చేసిన CM KCR: అస్సాం సీఎం దిమ్మతిరిగే కౌంటర్ Video


మౌనిక జాడ కోసం తెల్లవారు జాము నుంచే గ్రామంలో బంధువుల ఇళ్లలో వెతికారు తల్లి, సోదరుడు. సోమవారం మధ్యాహ్నం సమయంలో హుగ్గెల్లి గ్రామ శివారులోని మామిడితోటలో పనిచేస్తున్న కూలీలు మౌనిక మృతదేహాన్ని గుర్తించి, గ్రామ సర్పంచ్ కు కబురు చేశారు. తల్లి, సోదరుడు అక్కడికి వెళ్లి చూసి అది మౌనిక మృతదేహమేనని బోరున విలపించారు. సర్పంచ్‌ రాజు ఫిర్యాదు మేరకు డీఎస్పీ శంకర్‌రాజు, సీఐ రాజశేఖర్‌ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జహీరాబాద్‌ ప్రభుత్వా స్పత్రికి తరలించారు.

ఘటనా స్థంలో పోలీసుల పరిశీలన


Obscenity Case: పోలీస్ స్టేషన్‌లో పాట పాడిన ప్రముఖ సింగర్ -పచ్చి బూతులు?

ప్రేమికుల రోజున ఏకాంతంగా గడుపుదామనే నెపంతో బాలికను మామిడితోటకు రప్పించిన ప్రియుడు.. ఆమెపై లైంగిక దాికి పాల్పడి పాల్పడి ఉంటాడని, ఆ విషయం ఇంట్లో వాళ్లకు చెబుతుందనే భయంతోనే ప్రియుడు ఆమెను చున్నీతో గొంతు బిగించి చంపేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, తల్లి బుజ్జమ్మ ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. సాక్ష్యాధారాలు లభ్యమైన తర్వాత నిందితుడి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
Published by:Madhu Kota
First published:

Tags: Minor girl, Sangareddy, Telangana crime news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు