హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

Telangana: మరోసారి తెరపైకి వైశాలి కిడ్నాప్ కేసు..హైకోర్టులో నిందితునికి ఊరట

Telangana: మరోసారి తెరపైకి వైశాలి కిడ్నాప్ కేసు..హైకోర్టులో నిందితునికి ఊరట

వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం

వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం

డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధాని మన్నెగూడలో పట్టపగలు నవీన్ రెడ్డి అనే వ్యక్తి 100 మందితో వైశాలి ఇంటికొచ్చి ఆమె కుటుంబసభ్యులను కొట్టి యువతిని అపహరించుకెళ్ళాడు. ప్రేమించిన అమ్మాయి మరొక పెళ్లికి సిద్ధపడిందని యువతి ప్రియుడు నవీన్ సినిమా లెవల్లో కిడ్నాప్ వ్యవహారాన్ని నడిపాడు. ఈ కేసులో నిందితునిగా ఉన్న నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నవీన్ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేయగా తాజాగా హైకోర్టు నవీన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధాని మన్నెగూడలో పట్టపగలు నవీన్ రెడ్డి అనే వ్యక్తి 100 మందితో వైశాలి ఇంటికొచ్చి ఆమె కుటుంబసభ్యులను కొట్టి యువతిని అపహరించుకెళ్ళాడు. ప్రేమించిన అమ్మాయి మరొక పెళ్లికి సిద్ధపడిందని యువతి ప్రియుడు నవీన్ సినిమా లెవల్లో కిడ్నాప్ వ్యవహారాన్ని నడిపాడు. ఈ కేసులో నిందితునిగా ఉన్న నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నవీన్ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేయగా తాజాగా హైకోర్టు నవీన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. కాగా మొన్న నవీన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడాన్ని రంగారెడ్డి జిల్లా కోర్టు నిరాకరించింది. దీనితో నవీన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై నేడు విచారణ జరిపిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

Warangal: షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 2 నెలల తర్వాత అనుమతి.. షరతులు ఇవే.!

అసలు వైశాలితో నవీన్ కు పరిచయం ఎలా ఏర్పడింది?

గతేడాది బొంగుళూరులోని స్పోర్ట్స్ అకాడమీలో వైశాలితో నవీన్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వైశాలి ఫోన్ నెంబర్ తీసుకున్న నవీన్ తరచూ కాల్స్, మెసేజ్ లు చేసేవాడు. కాస్త పరిచయం పెరగడంతో ఆమెతో కలిసి నవీన్ ఫోటోలు తీసుకున్నాడు. ఈ క్రమంలో వైశాలిని పెళ్లి చేసుకోవాలనే ఆశ నవీన్ లో పుట్టుకొచ్చింది. దీనితో వైశాలి ముందు నవీన్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. అయితే వైశాలి తన తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని నవీన్ కు చెప్పింది. ఈ క్రమంలోనే వైశాలిని పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు నవీన్ చెప్పుకొచ్చాడు. కానీ వైశాలి తల్లిందండ్రులు మాత్రం నవీన్ తో పెళ్ళికి ససేమిరా అన్నారు. ఇది మనసులో పెట్టుకున్న నవీన్ వైశాలి తల్లి దండ్రులపై కక్ష పెంచుకున్నాడు. వైశాలి పేరుతో నకిలీ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను క్రియేట్ చేశాడు. ఆ ఖాతాలో గతంలో వైశాలితో దిగిన ఫోటీలను నవీన్ వైరల్ చేశాడు. అలాగే వైశాలి ఇంటి ముందు ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకున్న నవీన్ గణేష్ నిమజ్జనం సందర్బంగా వైశాలి ఇంటి ముందు స్నేహితులతో కలిసి నానా హంగామా చేశాడు. దీనిపై యువతి ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

నిశ్చితార్ధం జరుగుతుందనే ఇదంతా..

డిసెంబర్ 9న వైశాలికి మరో యువతితో నిచ్చితార్ధం జరుగుతుందన్న విషయం తెలుసుకున్న నవీన్ పక్కా ప్లాన్ వేశాడు. యువతిని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతని స్నేహితులు, టీ షాప్ లో పని చేసే యువకుల సాయంతో యువతి ఇంటికి చేరుకున్నాడు నవీన్. ఇంటి ముందు కార్లను ధ్వంసం చేసి వైశాలి కుటుంబసభ్యులను కొట్టి వైశాలిని ఇంట్లో ఉన్న సీసీ కెమెరా, డివిఆర్ లను కారులో ఎత్తుకెళ్లాడు. కారులో నల్గొండ వైపు వెళ్తున్న నవీన్ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను చూసి నల్గొండ వద్ద నవీన్ రెడ్డి, అతని స్నేహితులు కారు దిగి వెళ్లిపోయారు. ఇక నవీన్ మరో స్నేహితుడు వైశాలిని వోల్వో కారులో హైదరాబాద్ కు తీసుకెళ్లాడు.

డిసెంబర్ 9నే వైశాలి తన తల్లిదండ్రులకు క్షేమంగానే ఉన్నానని ఫోన్ చేసింది. ఇక ఈ కేసులో నిందితుడు నవీన్ రెడ్డితో పాటు 38 మందిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డికి కోర్టు బెయిల్ ఇచ్చింది.

First published:

Tags: Crime, Crime news, Hyderabad, Telangana

ఉత్తమ కథలు