జైలుకెళ్లి తండ్రిని చూసి వస్తున్న యువతిపై గ్యాంగ్ రేప్... మూడు నెలల తర్వాత...

గ్రేటర్ నోయిడాలో 20 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్... తండ్రిని జైలు నుంచి విడిపిస్తామని నమ్మించి అత్యాచారం చేసిన ముగ్గురు యువకులు... భయపడి రెండు నెలల తర్వాత ఫిర్యాదు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 11, 2019, 6:43 PM IST
జైలుకెళ్లి తండ్రిని చూసి వస్తున్న యువతిపై గ్యాంగ్ రేప్... మూడు నెలల తర్వాత...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 11, 2019, 6:43 PM IST
జైలుశిక్ష అనుభవిస్తున్న తన తండ్రిని పరామర్శించి వస్తున్న యువతి... గ్యాంగ్ రేప్‌కు గురైంది. గత ఏడాది అక్టోబర్ 24న ముగ్గురు యువకుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన సదరు యువతి... డిసెంబరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుల కోసం గాలిస్తున్నారు. జైలుశిక్ష అనుభవిస్తున్న తన తండ్రిని బయటికి తీసుకువస్తానని చెప్పి... నమ్మించిన వ్యక్తి, స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి ఒడిగట్టాడని తన ఫిర్యాదులో పేర్కొంది సదరు యువతి. గ్రేటర్ నోయిడాకు చెందిన 20 ఏళ్ల యువతి తండ్రి... ఏదో కేసు మీద అరెస్ట్ అయ్యి... లుక్సర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాబీ అనే వ్యక్తి... ఆమెకు కాల్ చేశాడు.

‘నీ తండ్రిని జైలు నుంచి ఎలా బయటికి తేవాలో నాకు తెలుసు... నువ్వు నన్ను కలువు’ అని చెప్పాడు. తండ్రిని జైలు నుంచి విడిపించేందుకు మంచి అవకాశం దొరికిందని భావించిన ఆమె... అతన్ని కలిసింది. అతనితో కలిసి లుక్సర్ జైలుకి వెళ్లి... ‘త్వరలోనే నిన్ను విడిపిస్తా...’ అని చెప్పింది. అక్టోబర్ 24న తండ్రిని కలిసి ఇంటికి వస్తున్న సమయంలో రాహుల్ అనే వ్యక్తి... ఆమెను కలిశాడు. ‘బాబీ... మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు’ అని చెప్పి ఆమెను బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లాడు. తన తండ్రితో రాహుల్‌ను ఓ సారి చూసిన యువతి... అతన్ని నమ్మింది. ఆమెను ఓ గదికి తీసుకెళ్లిన రాహుల్... అక్కడ బాబీ, విక్రమ్‌లతో కలిసి సామూహిక అత్యాచారం చేశారు. తర్వాత ఆటోరిక్షాలో ఆమెను ఇంటి దగ్గర వదిలేశారు. తనకు జరిగిన దారుణం గురించి చెప్పేందుకు చాలా భయపడ్డానని చెప్పిన సదరు యువతి... తనపై గ్యాంగ్ రేప్ చేసిన దృశ్యాలను వీడియో తీసి వాటితో బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టారని పేర్కొంది. అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేదంటే రేప్ వీడియో ఆన్‌లైన్‌లో పెడతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసింది.

ఇవి కూడా చదవండి...

వీల్‌ఛైర్ వివాహం... ఆసుపత్రిలో ఒక్కటైన ప్రేమజంట...
ప్రాణం తీసిన దురాచారం... ‘నెలసరి’ గుడిసెలో ఊపిరాడక ముగ్గురి మృతి...


ఇంట్లోనే యూనివర్సిటీ.. డబ్బు కొట్టు.. పట్టా పట్టు


దొంగతనానికి ‘సాక్ష్యం’ చెబుతానంది... అంతలోనే ఆత్మహత్య... పోలీసుల విచారణ కారణంగా...

Loading...

థాయిలాండ్‌లో సౌదీ యువతికి అవమానం... ఆస్ట్రేలియా యువతుల ‘టాప్‌లెస్’ నిరసన...


మేనల్లుడి ప్రేయసితో స్నేహం... అతిదారుణంగా చంపి... తులసి మొక్క నాటాడు...

First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...