• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • UTTARPRADESH POLICE OFFICER ATTEMPTED TO RAPE WOMEN COMPLAINANT IN PILBITH MS

సాయం కోరి వచ్చిన మహిళ.. కామంతో కళ్లు మూసుకుపోయిన పోలీసు.. విచారణ అని ఇంటికి పిలిచి..

సాయం కోరి వచ్చిన మహిళ.. కామంతో కళ్లు మూసుకుపోయిన పోలీసు.. విచారణ అని ఇంటికి పిలిచి..

ప్రతీకాత్మక చిత్రం

రక్షణ కోరి వచ్చిన మహిళలను రక్షించాల్సిన బాధ్యత ఉన్న ఖాకీలు.. వారిపైనే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • News18
  • Last Updated:
  • Share this:
    ఫ్రెండ్లీ పోలీసింగ్.. ప్రజల కోసం పని చేసే పోలీసులు.. ఇలా ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఖాకీల తీరు మాత్రం మారడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు అవసరమని నిపుణులు చెబుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీంతో రక్షక భటులుగా ఉండాల్సిన వాళ్లే గాడి తప్పుతున్నారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన వాళ్లే వారిపై కాఠిన్యంగా వ్యవహరిస్తున్నారు. రక్షణ కోరి వచ్చిన మహిళలను రక్షించాల్సిన బాధ్యత ఉన్న ఖాకీలు.. వారిపైనే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని పిలిబిత్ జిల్లలా బర్కేరా ఏరియాలోని బిసాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాంగోపాల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన దగ్గరికి ఒక మహిళ వచ్చారు. ఒక కేసు పనిమీద వచ్చిన ఆమె స్టేషన్లో ఫిర్యాదు చేసి వెళ్లారు. అయితే ఫిర్యాదు కాపీలో ఆమె ఫోన్ నెంబర్ కూడా రాశారు.

    ఆ ఫోన్ నెంబర్ తీసుకున్న రాంగోపాల్.. తరుచూ ఆమెకు ఫోన్ చేసేవాడు. ముందు కేసు గురించి విచారిస్తున్నట్టు మాటలు కలిపాడు. ఇదే క్రమంలో ఆమెను బిసాల్ పూర్ లో ఉన్న తన ఇంటికి రమ్మన్నాడు. కేసు విచారణ చేయాలని చెప్పి ఆమెను ఇంటికి పిలిపించుకున్నాడు. విచారణ అని చెప్పడంతో నమ్మిన ఆ మహిళ.. ఎస్ఐ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎస్ఐ తప్ప ఎవరూ లేరు. ఇదే అదునుగా భావించిన సదరు ఎస్ఐ.. ఆమె రాగానే తలుపులు బిగించాడు. ఆ తర్వాత ఆమెను మాటల్లో పెట్టి.. అత్యాచారానికి యత్నించాడు. కానీ ఎస్ఐ ఆటలకు ఆమె లొంగలేదు.

    అయితే తనతో గడపకుంటే.. ఈ కేసు ముందుకెళ్లదని చెప్పాడు. అంతేగాక ఈ విషయంపై తన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ మహిళ భర్తపై తప్పుడు కేసులు పెడతానని బెదిరించాడు. రాంగోపాల్ ఎన్నిరకాలుగా యత్నించినా లొంగని ఆ మహిళ.. ఈ విషయాన్ని ధైర్యంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఐని విచారించిన అధికారులు.. అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు