వాళ్లిద్దరికీ మూడేళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లి సమయంలో వధువు తండ్రి.. వరుడి తరఫువాళ్లు కోరినంత కట్నం ఇచ్చాడు. కట్నంతో పాటు ఇతర కానుకలు ముట్టజెప్పాడు. కొద్దిరోజుల తర్వాత ఆ భర్త, అత్తమామలు.. భార్యను వేధించం మొదలుపెట్టారు. అదనపు కట్నం తీసుకురావాలని ఆమెను వేధించారు. దీనిపై పలుమార్లు పంచాయతీలు కూడా అయ్యాయి. కట్నం ఓ సాకైతే.. పెళ్లై మూడేళ్లు గడుస్తున్నా ఆ జంటకు ఇంకా పిల్లలు కలుగలేదు. దీంతో.. ఆ భార్యకు అత్తింటి పోరు తీవ్రమైంది. ఆమెను గొడ్రాలు అని.. పిల్లలు పుట్టరని.. సూటి పోటి మాటలతో చిత్రహింసలకు గురిచేశారు. చివరికి.. ఆమెను కాటికి పంపాడా భర్త. పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. యూపీలోని బిజ్నోర్ లో గల ముకర్పురి గ్రామానికి చెందిన రోహిత్ కుమార్ కు.. ప్రీతితో మూడేళ్ల క్రితమే పెళ్లైంది. రోహిత్ అడిగినంత కట్నం ఇచ్చిన ప్రీతి తండ్రి.. కూతురు పెళ్లిని ఉన్నంతలో ఘనంగా చేసి.. కట్న కానుకలు ఇచ్చి సాగనంపాడు. కానీ ఆమె అత్తగారింటికి వెళ్లిందే కానీ.. ఆ ఆనందం ప్రీతికి ఎక్కువకాలం నిలువలేదు.
భర్త రోహిత్ తో పాటు అత్తమామలు ప్రీతిని తరుచూ వేధించేవారు. అదనపు కట్నం కావాలని పీక్కు తినేవారు. దీనిమీద ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు పంచాయతీలు కూడా అయ్యాయి. అయినా రోహిత్ కుటుంబం ఏం మారలేదు. ఇదే సమయంలో మూడేళ్ల నుంచి ప్రీతికి గర్భం రాలేదు. దీంతో అత్తగారింట్లో ఆమెకు వేధింపులు చెప్పనలవి కాకుండా ఎక్కువయ్యాయి. చీటికి మాటికి అత్త, భర్త నుంచి సూటి పోటి మాటలు భరించింది ప్రీతి.
ఇదిలాఉండగా.. సోమవారం ప్రీతిని రోహిత్, అతడి కుటుంబం కలిసి హత్య చేసింది. ప్రీతిని బంధించి.. ఆమెను ఒక మంచానికి కట్టి.. గొంతు నులిమి చంపారని ప్రీతి తండ్రి ఆరోపిస్తున్నాడు. ఆమె గొంతు, చేతుల దగ్గర తాడుతో కట్టేసిన గుర్తులు ఉన్నాయని ఆయన అన్నాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలి భర్త, అత్తమామలపై కేసు నమోదైంది. పోలీసులు వారిని అరెస్టు చేశారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి, వరకట్న చట్టంలో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Dowry, Dowry harassment, Husband kill wife, Uttarpradesh