Crime News: అనుమానంతో భార్య తల నరికిన భర్త.. యూపీలో దారుణం

ఉత్తరప్రదేశ్ నేరాలకు అడ్డాగా మారుతున్నది. నిత్యం అక్కడ ఏదో ఒకచోట దారుణాలు బయటపడుతూనే ఉన్నాయి. నేరాలను అరికట్టడానికి సీఎం యోగి ఆదిత్యానాథ్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నేరాలు మాత్రం అదుపులోకి రావడం లేదు.

news18
Updated: October 9, 2020, 6:21 PM IST
Crime News: అనుమానంతో భార్య తల నరికిన భర్త.. యూపీలో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 9, 2020, 6:21 PM IST
  • Share this:
అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. ఒక మనిషికి ఎవరిమీదైనా అనుమానం వచ్చిందంటే.. అది ఓ పట్టాన పోదు. ఇక భార్యాభర్తల మధ్య అనుమానాలు తలెత్తితే మాత్రం అవి వారి కాపురానికే గాక ఇరువురి ప్రాణాలకు ముప్పు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. అనుమానంతో ఒక భర్త తన భార్య తలను కత్తితో నరికాడు. అక్రమ సంబంధం కలిగి ఉందని అనుమానంతో ఆ వ్యక్తి ఆమె శిరచ్ఛేదనం చేశాడు.

వివరాల్లోకెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని నేతానగర్ కు చెందిన చిన్నార్ యాదవ్ శుక్రవారం ఉదయం 7.30 గంటలకు తన భార్యతో గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగడంతో నిందితుడు తన వెంట తెచ్చి పెట్టుకున్న కత్తితో.. ఆమె తలపై ఒక్క వేటు వేశాడు. అంతే.. ! ఆమె తల, మొండెం వేరయ్యాయి.

uttarapradesh, crime, murder, netanagar, chinnar yadav, up crime news
ప్రతీకాత్మక చిత్రం


అంతటితో ఆగని చిన్నార్ యాదవ్.. మరణించిన తన భార్య తలను పట్టుకునిక వచ్చి బబెరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. నిందితుడు తలను పట్టుకుపోతున్నప్పుడు పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇది వైరలైంది

. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన ఆయన భార్య మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపినట్టు జిల్లా ఎస్పీ మహేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇప్పటికే హత్రాస్ గ్యాంగ్ రేప్, ఇతర ఘటనలతో అట్టుడుకుతున్న యూపీలో.. తాజా ఘటన మరింత కలకలం రేపింది.
Published by: Srinivas Munigala
First published: October 9, 2020, 6:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading