Home /News /crime /

Cyber Crime: కుక్కపిల్లకి రూ. 66 లక్షలు: మోసపోయిన మహిళ

Cyber Crime: కుక్కపిల్లకి రూ. 66 లక్షలు: మోసపోయిన మహిళ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రోజు రోజుకు మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మోస‌పోయే వారుంటే ఏం చెప్పి అయిన మోసం చేయొచ్చు అని రుజువు చేస్తున్నారు మోస‌గాళ్లు. ఆన్‌లైన్‌(Online)లో మోసాలు మ‌రీ పెరిగిపోయాయి. ఓ యాభై ఏళ్ల మ‌హిళ గోల్డెన్ రిట్రీవర్ (Golden Retriever) కుక్కపిల్ల కోసం రూ.66ల‌క్ష‌లు చెల్లించి మోస‌పోయింది.

ఇంకా చదవండి ...
    రోజు రోజుకు మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మోస‌పోయే వారుంటే ఏం చెప్పి అయిన మోసం చేయొచ్చు అని రుజువు చేస్తున్నారు మోస‌గాళ్లు. ఆన్‌లైన్‌లో మోసాలు మ‌రీ పెరిగిపోయాయి. ఓ యాభై ఏళ్ల మ‌హిళ గోల్డెన్ రిట్రీవర్ కుక్కపిల్ల కోసం రూ.66ల‌క్ష‌లు చెల్లించి మోస‌పోయింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.
    ఉత్త‌రాఖండ్‌కు చెందిన ఓ మ‌హిళ ఆమె తన కుమార్తెకు పుట్టినరోజు కానుకగా గోల్డెన్ రిట్రీవర్ (Golden Retriever) కుక్కపిల్లని ఆన్‌లైన్‌లో 15,000 రూపాయలు కొనుగోలు చేయాలనుకుంది. ఇందుకు ఆన్‌లైన్‌లో డెహ్ర‌డూన్‌కు చెందిన‌ డింగ్ బొబ్గా క్లోస్ అలియాస్ బాబీ ఇబ్రహీంను సంప్ర‌దించింది. అత‌ను అన్ని ట్రాన్స్‌పోర్టు (Transport) చార్జీల‌తో క‌ల‌పి రూ.66 ల‌క్ష‌లు అవుతుంద‌ని తెలిపారు. అత‌ని న‌మ్మి ఆ మ‌హిళ రూ.66ల‌క్ష‌లు చెల్లించింది. చెల్లించిన త‌ర్వాత కూడా మ‌రింత డ‌బ్బులు అడుగుతుండ‌డంతో ఆమెకు అనుమానం వ‌చ్చింది.


    ఆమె త‌న డ‌బ్బు త‌న‌కు తిరిగి ఇవ్వ‌మ‌ని అడిగింది. మీ డ‌బ్బు మీకు ఇవ్వ‌డానికి కూడా డ‌బ్బులు చెల్లించాల‌న అడిగాడు. దీంతో విస్తుత పోయిన ఆ మ‌హిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సైబ‌ర్ క్రైం (Cyber Crime) పోలీసులు వ్య‌క్తిని బెంగుళూర్‌కు చెందిన కామెరూన జాతీయుడిగా గుర్తించారు. అత‌న్ని ఉత్త‌రాఖండ్ పోలీసులు అరెస్టు చేసి డెహ్రాడూన్‌కు తీసుకెళ్లారు. దీనిపై ఉత్తరాఖండ్‌లోని డీఎస్‌పీ (STF) అంకుష్ మిశ్రా క్లౌస్ ద్వారా ఆన్‌లైన్ మోసానికి రూ .66 లక్షలు నష్టపోయిన తర్వాత బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. నిందితుడు ద‌శ‌ల వారీగా ఆమె వ‌ద్ద నుంచి మాయ‌మాట‌లు చెప్పి డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్ట గుర్తించామ‌న్నారు. నిందితుల నుంచి ఎల‌క్ట్రానిక్ గాడ్జెట్‌లు, డ‌జ‌న్‌కు పైగా ఫోన్‌లు, సిమ్ కార్డులు, ఏటీఎం కార్డులు, ల్యాప్‌టాప్ ప‌లు ర‌కాల ఎల‌క్ట్రానిక్ గాడ్జెట్‌లు స్వాధీనం చేసుకొన్న‌ట్టు పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం నిందితుడిని జ్యుడీషియ‌ల్(Judicial) క‌స్ట‌డీలోకి తీసుకొన్న‌ట్టు ఎస్‌టీఎఫ్ ఎస్‌పి అజయ్ సింగ్ తెలిపారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: CYBER CRIME

    తదుపరి వార్తలు