హోమ్ /వార్తలు /క్రైమ్ /

రిసార్ట్ లో రిసెప్షనిస్ట్ దారుణహత్య.. కీలక విషయాలు వెల్లడించిన డీజీపీ

రిసార్ట్ లో రిసెప్షనిస్ట్ దారుణహత్య.. కీలక విషయాలు వెల్లడించిన డీజీపీ

నిందితుడు పుల్కిత్ ఆర్య,బాధితురాలు అంకితా భండారి

నిందితుడు పుల్కిత్ ఆర్య,బాధితురాలు అంకితా భండారి

Uttarakhand: బీజేపీ సీనియర్ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య చేసిన ఘనకార్యంపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttarakhand (Uttaranchal), India

ఉత్తరాఖండ్ లో (Uttarakhand) బీజేపీ సీనియర్ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా, పుల్కిత్ ఆర్య కు చెందిన రిసార్ట్ లో యువతి అంకిత బండారి రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుండేది. ఈ క్రమంలో యజమాని ఆమెను కస్టమర్లతో వ్యభిచారం చేయాల్సిందిగా వేధించాడని ఆమె తనన స్నేహితురాలికి వాట్సాప్  చేసి చెప్పింది. ఆ తర్వాత.. కొన్ని గంటలకే శవమై కన్పించింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిపై పోలీసు అధికారులు సీరియస్ గా విచారణ చేపట్టారు.

పోలీసుల ప్రకారం.. రిసార్ట్ కు వచ్చే కస్టమర్లతో వ్యభిచారం చేయాల్సిందిగా పుల్కిత్ ఆర్య, అంకితను (Ankita bhandari murder case) వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైందని పోలీసులప్రాథమిక విచారణలో తెలింది. బాధితురాలు ఆమె స్నేహితురాలికి పంపిన వాట్సాప్ సందేశాలు కూడా పోలీసులకు చిక్కాయని డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. 19 ఏళ్ల యువతి అంకితను కస్టమర్లతో వ్యభిచారం చేయకపోవడం వలన చంపినట్లు బయటపడింది. దీనిలో రిసార్ట్ యజమాని మరో ఇద్దరు నిందితులు పాల్గొన్నట్లు విచారణలో తెలింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టామని డీజీపీ తెలిపారు. కాగా, నిందితుడిని కోర్టుకు తీసుకెళ్తుండగా కొంత మంది నిందితుడిపై రాళ్లదాడి చేసి,నిరసన చేపట్టారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు.

అంతే కాకుండా నిందితుడిని ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. కాగా,యువతి మిస్సింగ్ కేసును స్థానిక పోలీసులు పట్టించుకోలేదని , నాలుగు రోజుల తర్వాత యువతి డెడ్ బాడీ మురుగు కాలువ నుంచి బయటకు తీశారు. అప్పుడు.. ఎఫైఐఆర్ నమోదైందని తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు లోకల్ పోలీసులను బదిలీ చేశారు. దీన్ని మహిళా కమిషన్ కూడా తీవ్రంగా తీసుకుంది. వెంటనే సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.

.ఉత్తరాఖండ్ మాజీ మంత్రి వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు పౌరీ జిల్లాలోని రిషికేశ్ మెయిన్ టౌన్ కి 10కిలోమీటర్ల దూరంలోని లక్ష్మణ్ ఝులా ప్రాంతంలో ఓ రిసార్టు ఉంది. ఈ రిసార్ట్ లో అంకితా భండారి అనే 19 ఏళ్ల యువతి రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుంది. తమ కూతురు కనిపించడం లేదంటూ అంకితా భండారి తల్లిదండ్రులు ఆదివారం(అక్టోబర్ 19)పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య కూడా అంకితా భండారి కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆ యువతి చివరగా రిసార్టులోనే కనిపించిందని తేలింది. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. వారి దర్యాప్తులో వెలుగుచూసిన విషయాలు షాక్ కు గురి చేసేలా ఉన్నాయి.

ఆ యువతిని బీజేపీ నేత కుమారుడు, రిసార్ట్ యజమానిగా ఉన్న పులకిత్ ఆర్య, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు కలిసి హతమార్చినట్లు దర్యాప్తులో వెల్లడయింది. ఆ తరువాత తమ నేరం బయటపడకుండా ఉండాలని ఆమె మృతదేహాన్ని సమీప కాలువలో పడేశారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో పుల్కిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అంకిత్ అలియాస్ పుల్కిత్ గుప్తాతో కలిసి అంకితా రిషికేష్ వెళ్లినట్టు పోలీసులు పేర్కొన్నారు. తిరిగి వస్తుండగా చిలా రోడ్డులోని కెనాల్ వద్ద మద్యం తాగేందుకు ఆగారు... వారు మద్యం తాగుతుంటే యువతి వారి కోసం వేచి చూసింది.. ఆ తర్వాత యువతికి, వారికి మధ్య గొడవ మొదలైంది.

రిసార్టులో వీరు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఈ విషయాన్ని బయటపెడతానని అంకితా బెదిరించింది. దీంతో కోపంతో ఊగిపోయిన నిందితులు అంకితాని కెనాల్‌లోకి తోసేశారు. పోలీసుల విచారణలో ఈ విషయాన్ని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం అమ్మాయి మృతదేహాన్ని కనుగొనేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు ఏసీబీ శేఖర్ చంద్ర వెల్లడించారు. అంకితా భండారి (19) మృతదేహాన్ని ఉత్తరాఖండ్ పోలీసులు శుక్రవారం పౌరీ గర్వాల్‌లోని నందాల్‌సన్ బెల్ట్‌లోని కెనాలో కనుగొన్నారు. దీంతో పుల్కిత్ ఆర్య,అతడికి సహకరించిన ఇద్దరు స్టాఫ్‌ మెంబర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు తెలిపారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Harassment on women, Uttarakhand

ఉత్తమ కథలు