చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే కొన్ని చోట్ల దారుణాలకు పాల్పడుతున్నారు. మహిళలు, అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కొంత మంది పోలీసులు కీచకులుగా మారి, ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. మరికొందరు తమ కోరిక తీరిస్తేనే కేసు పరిష్కరిస్తామంటూ బెరాలకు దిగుతున్నారు. కొందరైతే ఏకంగా జైలులోనే బాధితులను అత్యాచారం కూడా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో వార్తలలో ఉంటున్నాయి. మరోక పోలీసులు అమానుష వేధింపులు ఘటన వెలుగులోనికి వచ్చింది.
పూర్తి వివరాలు.. ఉత్తరా ఖండ్ లో (Uttarakhand) దారుణమైన సంఘటన జరిగింది. జోగివాలా పోలీస్ స్టేషన్ లో పోలీసులు మహిళ పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. బాధిత మహిళ మంజు, స్థానికంగా .. మోహకంపూర్ గ్రామంలోని దేవెంద్ర ధ్యాని అనే రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో పనికోసం వెళ్తుంటుంది. ఈ క్రమంలో.. ఈ నెల 14 న వారు పెళ్లి కోసం వెళ్లారు. దీంతో వారి ఇంటికి తిరిగి వచ్చాక, డబ్బులు,నగలు కన్పించక పోవడాన్ని గమనించారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పనిమనిషి మంజుపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో జోగివాలా పోలీస్ స్టేషన్ పోలీసులు మహిళను స్టేషన్ కు రప్పించారు.
విచారణ పేరుతో ఆమెపట్ల అమానుషంగా ప్రవర్తించారు. మహిళను లాఠీలతో కొడుతూ, బూట్లతో తంతూ దారుణంగా వ్యవహరించారు. ఆ తర్వాత కరెంట్ షాక్ కూడా ఇచ్చారు. అపస్మారక స్థితిలోనికి రాగానే మహిళను వాహనంలో తీసుకొచ్చి.. బాధితురాలి ఇంటి దగ్గర పడేసి వెళ్లిపోయారు. దీంతో బాధితురాలని భర్త.. తన భార్యను ఆస్పత్రికి తరలించారు. ఆమెను అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఈ వ్యవహరం పై అధికారుల వరకు వెళ్లింది. ఈ క్రమంలో అధికారులు సీరియస్ అయ్యారు. ఘటనకు కారణమైన స్టేషన్ ఇంచార్జీ దీపక్ గైరోలాను సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
బీహర్ లో (Bihar) అమానుష సంఘటన జరిగింది.
సమస్తిపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బెగుసరాయ్ గ్రామానికి చెందిన యువతి.. ముజఫర్ నుంచి బరౌని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా యువతి, కకోర్బాధా రైల్వే స్టేషన్ సమీపంలోని సమస్తిపూర్-బరౌని రైల్వే లైన్ లో ప్రయాణిస్తుండగా ఈ అమానుషం జరిగింది. యువతి రైలులో సింగిల్ ఉంది. దీంతో కొంత మంది ఆకతాయిలు ఆమెను వేధించారు. ఆమె దగ్గరకు వచ్చి కూర్చున్నారు. తాకడానికి ప్రయత్నించారు.
రైలు కోచ్ లో ఎవరు లేకపోవడం,రైలు వేగంగా వెళ్తుండటంతో యువకులు మరింత రెచ్చిపోయారు. యువతిని అసభ్యంగా (Harassment) తాకుతూ.. దుర్భాషలాడారు. దీంతో భయపడిపోయిన యువతి.. వెంటనే ట్రైన్ లోని ఎక్సిట్ దగ్గరకు చేరుకుంది. జన్ సధారన్ రైలు చైన్ లాగడానికి ప్రయత్నించింది. కానీ ఆకతాయిలు ఆమె ప్రయత్నాన్ని అడ్డగించారు. ఇక బాత్రూమ్ వద్దకు వెళ్లి.. రైలు డోర్ తెరచింది. రైలు వేగంగా వెళ్తుంది. దీంతో ఆకతాయిలు ఆమె వైపుకు వస్తున్నారు. దీంతో భయపడిపోయిన యువతి వెంటనే కిందకు దూకేసింది. దీంతో బాధితురాలకి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, యువతిని అక్కడే ఉన్న రైల్వే పోలీసు చూశాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితురాలని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.