ఆరేళ్ల బాలికను చంపి, ఆమె శవంపై అత్యాచారం...

ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలిక కిడ్నాప్... కేకలు వేయడంతో గొంతు పిసికి చంపిన నిందితుడు... పాప శవంపై అత్యంత దారుణంగా...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 30, 2019, 4:17 PM IST
ఆరేళ్ల బాలికను చంపి, ఆమె శవంపై అత్యాచారం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పరమశివుడు కొలువైన హరిద్వార్ పుణ్యక్షేత్రానికి సమీపంలో దారుణం వెలుగుచూసింది. అన్యం పుణ్యం ఎరుగని ఆరేళ్ల పసి పాపను అత్యంత పైశాచికంగా చంపి, ఆమె శవంపై దారుణచర్యకు ఒడిగట్టాడో సెక్యూరిటీ గార్డు. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన హరిద్వార్‌కు 35 కి.మీ.ల దూరంలో ఉన్న శ్యామ్‌పూర్ గ్రామంలో వెలుగుచూసింది. గత శుక్రవారం ఊర్లో ఉన్న గుడిసెల దగ్గర తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న ఆరేళ్ల బాలిక... హఠాత్తుగా కనిపించకుండా పోయింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదుచేసుకున్న పోలీసులు... పాప కోసం గాలించగా ఛడియాపూర్ గ్రామ శివారులో ఉన్న అడవుల్లో బాలిక మృతదేహం కనిపించింది. బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించగా... బాలికను గొంతు పిసికి చంపి, ఆమె శవంపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. డాగ్ స్క్వాడ్ సాయంతో దర్యాప్తు చేయగా... శ్యామ్‌పూర్ ఏరియాలో ఉన్న పౌల్ట్రీ ఫామ్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించే సోనూ అనే వ్యక్తి... బాలికపై హత్యాచారం చేసినట్టు తేలింది.

బాలిక తల్లిదండ్రులు బిజ్నూర్ ఏరియాలో కూలీపనులు చేస్తూ జీవిస్తున్నారు. బాలికను ఇంట్లో ఒంటరిగా వదిలి, తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో దారుణం జరిగినట్టు తేలింది. ఆడుకుంటున్న బాలికను చూసిన సోనూ... ఆమె పక్కకి రాగానే కిడ్నాప్ చేశాడని, భయంతో పాప కేకలు వేయడంతో గొంతు పిసికి చంపేశాడని పోలీసులు తెలిపారు. బాలికను కిడ్నాప్ చేసిన చోటు నుంచి 600 మీటర్లు తీసుకెళ్లి... అడవిలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అఘాయిత్యానికి పాల్పడిన ప్రదేశానికి చేరుకునేసరికి బాలిక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలుసుకున్నా... అత్యంత అమానవీయంగా ఆమె శవంపైనే తన కామవాంఛ తీర్చుకున్నాడు సోను. నిందితుడు చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
First published: April 30, 2019, 4:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading