అర్ధరాత్రి ప్రొఫెసర్ ఫోన్.. ఇంటికి రావాలని విద్యార్థినికి వేధింపులు..

ఇంతవరకు సదరు ప్రొఫెసర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె గవర్నర్‌ను ఆశ్రయించారు. వర్సిటీలో విద్యార్థినుల భద్రతపై దృష్టి సారించాలని.. సదరు ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ వీసీని ఆదేశించారు.

news18-telugu
Updated: November 15, 2019, 4:18 PM IST
అర్ధరాత్రి ప్రొఫెసర్ ఫోన్.. ఇంటికి రావాలని విద్యార్థినికి వేధింపులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తరాఖండ్‌లోని జీబీ పంత్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ వర్సిటీ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.అర్ధరాత్రి పూట ఆమెకు ఫోన్ కాల్ చేసి.. ఇంట్లో తన భార్య లేదని.. వచ్చి వంట చేసి పెట్టాలని కోరాడు. ఇదే విషయాన్ని విద్యార్థిని వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ద‌ృష్టికి తీసుకెళ్లింది. అర్ధరాత్రి తనకు ఫోన్లు చేసి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఎన్నిసార్లు ఫోన్ కట్ చేసినా పదేపదే కాల్ చేసి వేధిస్తున్నాడని వీసీకి తెలిపింది.

విద్యార్థిని ఫిర్యాదుతో వీసీపై స్పందించారు. ఓరోజు అర్ధరాత్రి పూట ఆ ప్రొఫెసర్ విద్యార్థినికి బర్త్ డే విషెస్ చెబుతూ మెసేజ్ పెట్టాడని వీసీ చెప్పారు. ఆ తర్వాత మరో మెసేజ్‌లో.. ఇంట్లో భార్య లేదని.. వచ్చి వంట చేయాలని కోరాడని తెలిపారు. ఆ మెసేజ్‌లన్నీ విద్యార్థిని తనకు చూపించిందన్నారు. బాధిత విద్యార్థిని ఇదే విషయాన్ని యూనివర్సిటీ కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ఇంతవరకు సదరు ప్రొఫెసర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె గవర్నర్‌ను ఆశ్రయించారు. వర్సిటీలో విద్యార్థినుల భద్రతపై దృష్టి సారించాలని.. సదరు ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ వీసీని ఆదేశించారు.

First published: November 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...