Home /News /crime /

UTTARAKHAND MAN VANDALISED SHIVA LINGAM AS HE WAS NOT CURED FROM LEG PAIN SINCE 12 YEARS DESPITE PRAYING EVERYDAY MS

ఏళ్లుగా వేడుకుంటున్నా తన మొర ఆలకించడం లేదని.. శివలింగాన్ని మాయం చేసిన భక్తుడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సర్వేశ్వరుడు తనకు అన్యాయం చేశాడనే ఆగ్రహంతో ఆదిదేవుడి రూపాన్ని ధ్వంసం చేయాలనుకున్నాడు ఆ భక్తుడు. అనుకున్నదే తడువుగా అత్యంత పురాతనమైన శివలింగాన్ని ఎత్తుకెళ్లాడు. అసలేం జరిగిందంటే...

  • News18
  • Last Updated :
    అతడు శివ భక్తుడు. తన ఊహ తెలిసినప్పటి నుంచీ శివుడినే ఆరాధిస్తున్నాడు. ఆ ముక్కంటి తన మొర ఆలకిస్తాడని గాఢంగా నమ్మాడు. సుమారు పదిహేను సంవత్సరాలు ఆ గరళ కంఠుడికి పూజలు చేశాడు. తన బాధలు తీర్చమని ఆ ఆది దేవుడికి ప్రతిరోజూ ఆరాధించాడు. కానీ ముక్కంటి అతడి వ్యాధిని నయం చేయలేదు. దీంతో సర్వేశ్వరుడు తనకు అన్యాయం చేశాడనే ఆగ్రహంతో ఆదిదేవుడి రూపాన్ని ధ్వంసం చేయాలనుకున్నాడు ఆ భక్తుడు. అనుకున్నదే తడువుగా అత్యంత పురాతనమైన శివలింగాన్ని ఎత్తుకెళ్లాడు. అసలేం జరిగిందంటే...

    ఉత్తరాఖండ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. అల్మోరా జిల్లా చిటాలిగఢ్ గ్రామానికి చెందిన తారాసింగ్ రానా శివ భక్తుడు. అతడు చాలా కాలంగా తీవ్రమైన కాలి నొప్పితో బాధపడుతున్నాడు. అయితే అతడికి సమీపాన ఉండే ద్వారహత్ ఆలయంలో ఉన్న బైరవుడి (శివుడు)ని ఆరాధిస్తే తన నొప్పి తగ్గుతుందని చాలా మంది చెప్పారు. తాను 12 వ తరగతి లో ఉండగా నొప్పి రాగా.. అప్పట్నుంచి ఇప్పటిదాకా (ఇప్పుడు రానాకు 24 ఏళ్లు) ఆ కైలాసాధిపతిని నిష్టగా పూజించాడు. ఎంతచేసినా తన కాలినొప్పి తగ్గకపోగా.. ఇంకా ఎక్కువైంది.

    దీంతో రానాకు ఆ త్రినేత్రుడిపై ఆగ్రహం ఎక్కువైంది. గౌరీపతి తన మొర ఆలకించడంలేదనే ఆవేదనతో.. అక్కడ ఉన్న పురాతనమైన శివలింగాన్ని ధ్వంసం చేయాలనుకున్నాడు. దాంతో ఇటీవలే ఒకరోజు రాత్రి ఆ ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్న శివలింగాన్ని దొంగిలించాడు. దానిని తీసుకెళ్లి ఒక పాడుబడ్డ పాఠశాలలో ఉన్న మురుగునీటి భావిలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టుగా ఉన్నాడు.

    అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజీలలో అసలు విషయం బయటపడింది. దీంతో రానా ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. అతడితో అసలు నిజం కక్కించారు. పోలీసులు తమ స్టైల్ లో విచారించడంతో ఆ విగ్రహం ఎక్కడుందో రానా చెప్పేశాడు. పోలీసులు దానిని బయటకు తీయగా.. దానిలో కొన్ని భాగాలు విరిగిపోయి ఉన్నాయి. అల్మోరా ప్రాంతం పురాతన ఆలయాలకు, ముఖ్యంగా శివాలయాలకు ప్రతీతి.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Almora S28p03, Crime, Crime news, Lord shiva, Uttarakhand

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు