హోమ్ /వార్తలు /క్రైమ్ /

రిసార్ట్ లోని రిసెప్షనిస్ట్ ని దారుణంగా హత్య చేసిన మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్!

రిసార్ట్ లోని రిసెప్షనిస్ట్ ని దారుణంగా హత్య చేసిన మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్!

నిందితుడు పుల్కిత్ ఆర్య,బాధితురాలు అంకితా భండారి

నిందితుడు పుల్కిత్ ఆర్య,బాధితురాలు అంకితా భండారి

Ankita Bhandari Murder Case  : ఓ యువతి హత్య కేసులో ఉత్తరాఖండ్(Uttarakhand) కు చెందిన బీజేపీ సీనియర్ లీడర్ వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య(Pulkit Arya)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Ankita Bhandari Murder Case  : ఓ యువతి హత్య కేసులో ఉత్తరాఖండ్(Uttarakhand) కు చెందిన బీజేపీ సీనియర్ లీడర్ వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య(Pulkit Arya)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి పుల్కిత్ ఆర్య తన రిసార్ట్ లో పనిచేసే యువతిని హత్య(Murder) చేశాడని పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో నిందితులు తేలడంతో వారిని అరెస్ట్ చేసి విచారించగా.. ఈ విషయాన్ని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు తెలిపారు. పుల్కిత్ ఆర్య తండ్రి వినోద్ ఆర్య ప్రస్తుతం ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో ఎలాంటి పోస్ట్ లేనప్పటికీ రాష్ట్ర మంత్రి హోదాను కలిగి ఉన్నారు. గతంలో వినోద్ ఆర్య మంత్రిగా,ఉత్తరాఖండ్ మటీ కాలా బోర్డ్(మట్టి కుండల ప్రమోషన్ కై ఏర్పాటైన ప్రభుత్వ ఏజెన్సీ) చైర్మన్ గా కూడా పనిచేశారు. అంతేకాకుండా,పుల్కిత్ ఆర్య సోదరుడు కూడా బీజేపీ నేతనే.

అసలేం జరిగింది

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తరాఖండ్ మాజీ మంత్రి వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు పౌరీ జిల్లాలోని రిషికేశ్ మెయిన్ టౌన్ కి 10కిలోమీటర్ల దూరంలోని లక్ష్మణ్ ఝులా ప్రాంతంలో ఓ రిసార్టు ఉంది. ఈ రిసార్ట్ లో అంకితా భండారి అనే 19 ఏళ్ల యువతి రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుంది. తమ కూతురు కనిపించడం లేదంటూ అంకితా భండారి తల్లిదండ్రులు ఆదివారం(అక్టోబర్ 19)పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య కూడా అంకితా భండారి కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆ యువతి చివరగా రిసార్టులోనే కనిపించిందని తేలింది. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. వారి దర్యాప్తులో వెలుగుచూసిన విషయాలు షాక్ కు గురి చేసేలా ఉన్నాయి. ఆ యువతిని బీజేపీ నేత కుమారుడు, రిసార్ట్ యజమానిగా ఉన్న పులకిత్ ఆర్య, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు కలిసి హతమార్చినట్లు దర్యాప్తులో వెల్లడయింది. ఆ తరువాత తమ నేరం బయటపడకుండా ఉండాలని ఆమె మృతదేహాన్ని సమీప కాలువలో పడేశారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో పుల్కిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అంకిత్ అలియాస్ పుల్కిత్ గుప్తాతో కలిసి అంకితా రిషికేష్ వెళ్లినట్టు పోలీసులు పేర్కొన్నారు. తిరిగి వస్తుండగా చిలా రోడ్డులోని కెనాల్ వద్ద మద్యం తాగేందుకు ఆగారు... వారు మద్యం తాగుతుంటే యువతి వారి కోసం వేచి చూసింది.. ఆ తర్వాత యువతికి, వారికి మధ్య గొడవ మొదలైంది. రిసార్టులో వీరు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఈ విషయాన్ని బయటపెడతానని అంకితా బెదిరించింది. దీంతో కోపంతో ఊగిపోయిన నిందితులు అంకితాని కెనాల్‌లోకి తోసేశారు. పోలీసుల విచారణలో ఈ విషయాన్ని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం అమ్మాయి మృతదేహాన్ని కనుగొనేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు ఏసీబీ శేఖర్ చంద్ర వెల్లడించారు. అంకితా భండారి (19) మృతదేహాన్ని ఉత్తరాఖండ్ పోలీసులు శుక్రవారం పౌరీ గర్వాల్‌లోని నందాల్‌సన్ బెల్ట్‌లోని కెనాలో కనుగొన్నారు. దీంతో పుల్కిత్ ఆర్య,అతడికి సహకరించిన ఇద్దరు స్టాఫ్‌ మెంబర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు తెలిపారు. యువతితో వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిందితులు ఆమెను వ్యభిచారంలోకి దింపడానికి చేసిన ప్రయత్నాలను మహిళ ప్రతిఘటించడం వల్లే చంపేశారనే ఆరోపణల గురించి అడిగినప్పుడు పౌరీ గర్వాల్ SSP యస్వంత్ సింగ్ మాట్లాడుతూ పోలీసులు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారని చెప్పారు. పౌరీ గర్వాల్‌లోని శ్రీకోట్ గ్రామానికి చెందిన యువతి. నెల రోజుల క్రితమే రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా చేరిందని పోలీసు వర్గాలు తెలిపాయి.

Sachin Pilot : రాజస్తాన్ లో కీలక పరిణామం..సచిన్ పైలట్ కు సీఎం పదవి!

రాష్ట్ర పోలీసు చీఫ్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.."పుల్కిత్ ఆర్యకు చెందిన రిసార్ట్ ఉన్న ప్రాంతం సాధారణ పోలీసుల పరిధిలోకి రాదు. అటువంటి ప్రాంతాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే పట్వారీ (Land Revenue Official)వ్యవస్థ మాకు ఉంది. యువతి మిస్సింగ్ అంటూ రిసార్ట్ యజమాని స్వయంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు. గురువారం జిల్లా మేజిస్ట్రేట్ ఈ కేసును మాకు బదిలీ చేసారు. మేము దానిని 24 గంటల్లో పరిష్కరించాము. రిసార్ట్ యజమానితో పాటు మరో ఇద్దరు నిందితులుగా గుర్తించాం" అని తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ సంఘటనను దురదృష్టకరం అని అభివర్ణించారు. బాధ్యులకు కఠిన శిక్ష విధించబడుతుందని అన్నారు. పోలీసులు తమ పని తాము చేసుకుపోతున్నారని, బాధితురాలికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.

First published:

Tags: Crime news, Uttarakhand

ఉత్తమ కథలు