ఉత్తర కాశీ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ నుంచి చార్ ధామ్ యాత్రకు, (Chardham yatra) యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు ఉత్తర ఖండ్ లో (Uttarakhand) ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. బస్సు వెంటనే 200 అడుగుల లోతున ఉన్న లోయలో పడింది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్, ఒక హెల్పర్, మరో 28 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి ఈ ప్రమాదంలో 26 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. ఇప్పటి వరకు అధికారులు శ్రమించి 17 మృతదేహలను బయటకు తీశారు. ప్రమాద స్థలానికి ఆ ప్రాంత అధికారులు చేరుకున్నారు.
గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అదే విధంగా, చనిపోయిన వారి కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేల చొప్పన ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. కేంద్ర మంత్రులు.. ఉత్తర ఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో (Pushkar singh dhami) మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇదిలా ఉండగా గతంలో బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
పదిహేను రోజుల క్రితం కూండా బెంగళూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. హైవేపై ప్రయాణిస్తున్న కాస్లీరు ఓ కరెంట్ పోల్‌కు ఢీ కొట్టడడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్లో చనిపోయారు. ఈ సంఘటన అర్థరాత్రి రెండు గంటల తర్వాత జరిగినట్టు పోలీసులు తెలిపారు. కర్ణాటక బెంగళూరులోని కోరమంగళ లోని ఓ కన్వేషన్ సెంటర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం రహదారిలోని ఓ కరెంట్ పోల్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారులో మంటలు చేలరేగాయి.
దీంతో కారు పూర్తిగా దగ్ధం అయింది.కాగా ఈ ప్రమాదంలో తమిళనాడులోని హోసూరు ఎమ్మెల్యే ప్రకాశ్ కొడుకుతోపాటు కోడలు కూడా మృతుల్లో ఉన్నారు. కాగా ఈ ప్రమాదంలో తమిళనాడులోని హోసూరు ఎమ్మెల్యే ప్రకాశ్ కొడుకుతోపాటు కోడలు కూడా మృతుల్లో ఉన్నారు.
కాగా ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఆరుగురు మృత్యువాత పడగా మరోకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే కారులో ప్రయాణిస్తున్న వారిలో ఎవరు కూడా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో పాటు ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బెలున్స్ తెరుచుకోకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bus accident, Pm modi, Uttarakhand