Home /News /crime /

UTTAR PRADESH WOMAN TRIES TO SET SELF ON FIRE ALLEGING SON ARRESTED IN FALSE CASE PAH

OMG: సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. . కారణం ఏంటంటే..

విచారణ చేపట్టిన పోలీసులు

విచారణ చేపట్టిన పోలీసులు

Uttar pradesh: ఒక మహిళ సీఎం కార్యాలయం వద్దకు చేరుకుంది. తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్ ను తలపై పోసుకుంది. అగ్గి పుల్ల వెలిగించుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఈ ఘటన కలకలంగా మారింది.

Woman Suicide Attempt at Yogi adityanath office:  ఉత్తర ప్రదేశ్ లో ఒక మహిళ తీవ్ర నిరాశకు గురైంది. ఎలాగైన తన సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకుంది. ఈ క్రమంలో సీఎం కార్యలయం సమీపంలో చేరుకుంది. కిరోసిన్ తన తలపై పొసుకుంది. ప్రాణత్యాగానికి సిద్ధపడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆమె చేతిలో నుంచి కిరోసిన్ బాటిల్ ను లాక్కున్నారు. ఆమె ప్రయత్నాన్ని అడ్డగించారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. లక్నోలోని గోసాయి గంజ్ కు చెందిన 52 ఏళ్ల రామ్ ప్యారీ అనే మహిళ శుక్రవారం మధ్యాహ్నం లోక్ భవన్ కార్యాలయం దగ్గర చేరుకుంది. ఆ కార్యలయంలో సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉంటారు. ఈ క్రమంలో అక్కడ కిరోసిన్ పోసుకుని ఆత్మహాత్యాయత్నం చేసింది. వెంటనే అధికారులు ఆమె ప్రయత్నాన్ని అడ్డగించి, ఆమెను అదుపులోనికి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.

ఆమె తన కొడుకుపై పోలీసులు అక్రమంగా కేసులను నమోదు చేశారని ఆరోపించింది. పోలీసుల వేధింపులు భరించలేకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని తెలిపింది. దీంతో పోలీసు అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆమెకు చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. అధికారులు విచారణ ప్రారంభించారు.

గతంలో ఒక వేధింపుల ఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది.

Madhya pradesh Minor Molested: ఒక బాలికపై అత్యాచార ఘటన ప్రస్తుతం కలకలంగా మారింది.   పాఠశాలలో విద్యాబుధ్దులు నేర్పించాల్సిన గురువే.. విద్యార్థిని పట్ల కీచకుడిగా మారాడు. ఆమెను లోంగదీసుకున్నాడు. ప్రతి రోజు ప్రైవేటు క్లాసు పేరిట సపరేట్ గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడే వాడు. ఈ సంఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలంగా మారింది.

పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లోని బేతుల్ లో దారుణమైన సంఘటన జరిగింది. స్థానికంగా ఉన్న స్కూల్ లో ఒక ట్యూటర్ విద్యార్థిని పట్ల కీచకుడిలా వ్యవహారించాడు. బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ క్రమంలో కొన్ని రోజులకు బాలిక గర్బం దాల్చింది. బాలిక ఆరోగ్యం మార్పులు రావడంతో దారుణం వెలుగులోనికి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ట్యూటర్ ను నిలదీస్తే.. ఈ విషయం బయటకు వస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.

అంతటితో ఆగకుండా.. స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ కూడా చేయించాడు. దీనికి బాలిక తల్లిదండ్రులు కూడా సహాకరించారు. ఈ  క్రమంలో కొన్ని రోజులకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై బాలికను విచారించారు. ఈ క్రమంలో.. ట్యూటర్ను, తల్లిదండ్రులను అరెస్టు చేశారు. బాలికకు ఆపరేషన్ చేసిన డాక్టర్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Suicide attempt, Uttar pradesh, Yogi adityanath

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు