లడ్డూలు పెట్టి చంపేస్తోంది...విడాకులు ఇప్పించండి అంటూ భర్త ఆర్తనాదాలు...

తన భార్య ఒక తాంత్రికుడి మాటలు విని తనకు రోజూ రెండు పూటల రెండు లడ్డూలు మాత్రమే ఆహారంగా పెడుతోందని, అంతేకాదు మధ్యలో మరే ఇతర ఆహారం పెట్టకుండా హింసిస్తోందని కోర్టులో మొర పెట్టుకున్నాడు. దీంతో ఆ భర్త చెప్పిన కారణం విని అంతా ఆశ్చర్యపోయారు.

news18-telugu
Updated: August 20, 2019, 5:18 PM IST
లడ్డూలు పెట్టి చంపేస్తోంది...విడాకులు ఇప్పించండి అంటూ భర్త ఆర్తనాదాలు...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఎవరైనా ఆనందం పంచుకునేందుకు స్వీట్ తినిపిస్తారు. అయితే ఒక సారి తినిపిస్తే సంతోషం, కానీ అన్న పానీయాలు మాన్పించి ప్రతీ రోజు రెండు లడ్డూలు మాత్రమే తిని బతకమంటే అది నరకంతోనే సమానం సరిగ్గా అలాంటి పరిస్థితే ఓ భర్త దుస్థితి అయ్యింది. వివరాల్లోకివ వెళితే ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన ఓ వ్యక్తి తనకు భార్య నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టుకెక్కాడు. అయితే అందుకు అతడు చెప్పిన కారణం విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన భార్య ఒక తాంత్రికుడి మాటలు విని తనకు రోజూ రెండు పూటల రెండు లడ్డూలు మాత్రమే ఆహారంగా పెడుతోందని, అంతేకాదు మధ్యలో మరే ఇతర ఆహారం పెట్టకుండా హింసిస్తోందని కోర్టులో మొర పెట్టుకున్నాడు. దీంతో ఆ భర్త చెప్పిన కారణం విని అంతా ఆశ్చర్యపోయారు.

గత కొంతకాలంగా తన ఆరోగ్యం బాలేకపోవడంతో తన భార్య ఒక తాంత్రికుడిని కలిసిందని అతడి సలహా మేరకే అలా చేసిందని వాపోయాడు. ఇక లడ్డూలు తినడం తన వల్ల కాదని, విడాకులు ఇప్పిస్తే హాయిగా ఉంటానని కోర్టుకు విన్నవించుకున్నాడు.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>