• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • UTTAR PRADESH WOMAN GANG RAPED WHILE RETURNING FROM OFFICE SU

షాకింగ్.. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న మహిళను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

షాకింగ్.. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న మహిళను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

ప్రతీకాత్మక చిత్రం

ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న మహిళపై కొందరు దుండగులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులు.. ఆపై గ్యాంగ్ రేప్ చేశారు.

  • Share this:
    దేశంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా అక్కడ మహిళలు, బాలికపై హింస కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న మహిళపై కొందరు దుండగులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులు.. ఆపై గ్యాంగ్ రేప్ చేశారు. వివరాలు.. నోయిడాలోని గౌతమ్ బుద్ద నగర్‌కు చెందిన బాధిత మహిళ.. ఘజియాబాద్‌లోని ఓ ఆఫీస్‌లో పనిచేస్తోంది. అయితే బుధవారం రాత్రి సమయంలో ఆమె ఘజియాబాద్‌లోని లాల్ కౌన్ సమీపంలో ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరింది. అయితే ఆమెను ఆటో డ్రైవర్, అతని ఇద్దరు స్నేహితులు కలిసి కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశారు. తర్వాత బాధిత మహిళను హపూర్‌ జిల్లాలోని పిల్ఖువా ప్రాంతంలో విడిచిపెట్టి పరారయ్యారు.

    "ఘజియాబాద్‌లోని మసూరి పోలీస్ స్టేషన్ నుంచి మా కంట్రోల్ రూమ్‌కు గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందింది. దీంతో పోలీసు సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాం" అని హపూర్ అడిషనల్ ఎస్పీ సర్వేష్ మిశ్రా తెలిపారు.

    ఇక, ఈ ఘటనకు సంబంధించి పిల్ఖువా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపారు. బాధిత మహిళ ఘజియాబాద్ ఇందిరాపురంలోని ఓ షోరూమ్‌లో పనిచేస్తుందని తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు