హోమ్ /వార్తలు /క్రైమ్ /

యువతి ఒంటిపై పెట్రోల్ పోసి చంపేసిన కుటుంబ సభ్యులు.. పరువు హత్యేనా..?

యువతి ఒంటిపై పెట్రోల్ పోసి చంపేసిన కుటుంబ సభ్యులు.. పరువు హత్యేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువతిని ఆమె కుటుంబ సభ్యులే అత్యంత దారుణంగా హత్య చేశారు. వేరే మతం వ్యక్తిని ప్రేమిస్తుందనే కారణంతో ఆమె బతికుండానే పెట్రోల్ పోసి నిప్పంటించినట్టుగా తెలుస్తోంది.

  ఓ యువతిని ఆమె కుటుంబ సభ్యులే అత్యంత దారుణంగా హత్య చేశారు. వేరే మతం వ్యక్తిని ప్రేమిస్తుందనే కారణంతో ఆమె బతికుండానే పెట్రోల్ పోసి నిప్పంటించినట్టుగా తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యువతిని చంపించేందుకు ఆమె కుటుంబ సభ్యులు రూ. 1.5 లక్షలు చెల్లించి వరుణ్ తివారీ అనే కాంట్రాక్ట్ కిల్లర్‌ను మాట్లాడుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే ఇది పరువు హత్యేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంత్ కబీర్ నగర్ ఎస్పీ కౌస్తుబ్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. " ఫిబ్రవరి 4వ తేదీన ధాన్‌ఘంట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిగినా గ్రామంలో సగం కాలిన యువతి శరీరాన్ని గుర్తించడం జరిగింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు అనేక కోణాల్లో విచారణ జరిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ కూడా రంగంలోకి దింపాం. ఆ మృతదేహాన్ని గోరఖ్‌పూర్‌లోని బెల్ఘాట్ ప్రాంతానికి చెందిన రంజనగా గుర్తించాం. బాధితురాలి మృతికి సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించాం. తన కూతురు ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమిస్తున్నట్టుగా బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపారు. ఆమె ముస్లిం వ్యక్తితో ప్రేమ బంధాన్ని విడిచి పెట్టడానికి సిద్ధంగా లేదని అతడు చెప్పాడు. దీంతో అతడు తన కొడుకు, అల్లుడుతో కలిసి ఆమెను చంపేందుకు స్కెచ్ వేశాడు. ఇందుకోసం ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌తో ఒప్పందం చేసుకున్నారు" అని తెలిపారు.

  ఇక, నిందితుల్లో ఒకరు ఫిబ్రవరి 3వ తేదీన రంజనాను బైక్‌పై జిగినా గ్రామ సమీపంలో ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు ఆమె చేతులు, కాళ్లు కట్టివేశాడని చెప్పారు. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారని తెలిపారు.

  ఈ కేసుకు సంబంధించి బాధితురాలి తండ్రి కైలాష్ యాదవ్, సోదరుడు అజిత్ యాదవ్, బావ సత్యప్రకాశ్ యాదవ్, మరో వ్యక్తి సీతారామ్ యాదవ్‌లను అరెస్ట్ చేసినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఈ హత్యకు ఉపయోగించిన బైక్‌ను, పెట్రోల్ క్యాన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Crime news, Honor Killing, Uttar pradesh

  ఉత్తమ కథలు