Home /News /crime /

UTTAR PRADESH WOMAN ALLEGEDLY SLITS LIVE IN PARTNERS THROAT STUFFS BODY IN TROLLEY BAG PAH

OMG: లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న ప్రియుడికి దిమ్మతిరిగే షాక్.. మహిళ ఏం చేసిందంటే..

 ప్రీతి శర్మ, ఫిరోజ్ (ఫైల్)

ప్రీతి శర్మ, ఫిరోజ్ (ఫైల్)

Uttar pradesh: పెళ్లై విడాకులు తీసుకున్న మరోకరితో శారరక సంబంధం పెట్టుకుంది. ఆమె బలహీనతను వాడుకున్న అతగాడు ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఆమెతో సహా జీవనం చేసేవాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India
కొంత మంది మహిళలకు, అమ్మాయిలకు మాయమాటలు చెబుతుంటారు. శారీరకంగా లొంగ దీసుకుంటారు. స్నేహం ముసుగులో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతుంటారు.తమ అవసరాల కోసం, ఎంతటికైన దిగజారుతుంటారు. మరికొందరు.. వివాహేతర సంబంధాలు కూడా కొనసాగిస్తుంటారు. ఇంట్లో వారికి తెలియకుండా లివ్ ఇన్ రిలేషన్ షిప్ (Affairs) అంటూ పెడదోవకు పోతుంటారు. కొన్నిసార్లు.. ఇలాంటి సందర్భాలలో ఇద్దరి మధ్య మొదట బాగానే ఉన్న ఆ తర్వాత.. గొడవలు జరుగుతుంటారు. కొన్నిసార్లు.. ఇవి వాగ్వాదాలతో పాటు, ఆత్మహత్యలు, హత్యలకు కూడా దారితీస్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh)  ఘజియాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. స్థానికంగా ఉండే ప్రీతి శర్మ అనే మహిళకు ఇప్పటికే పెళ్లై విడాకులు తీసుకుంది. ఆమెకు.. ఫిరోజ్ అలియాస్ చ్వానీ (23) తో పరిచయం ఏర్పడింది. నాలుగెళ్ళుగా అతడితోనే జీవిస్తుంది. అయితే.. ఈ మధ్య కాలంలో.. ప్రీతిశర్మ తనను పెళ్లి చేసుకొవాలని, ఫిరోజ్ ను కోరింది. అయితే.. దాన్ని అతగాడు దాటవేస్తు వచ్చాడు. అప్పుడు చివరకు తమ కులాలు వేరే అందుకు తమ ఇంట్లో ఒప్పుకొవట్లేదని అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.అంతటితో ఆగకుండా.. నీ క్యారెక్టర్ లేదంటూ మహిళను నోటికొచ్చినట్లు దూషించాడు. ఈ క్రమంలో.. మహిళ కోపంతో రేజర్ తీసుకుని అతగాడి గొంతు కోసేసింది. ఆ తర్వాత.. ఒక గొనె సంచిలో వేసుకుని, ట్రాలీలో శవాన్ని పెట్టుకుని.. నదిలో పాడేయడానికి వెళ్తుంది. అప్పుడు అక్కడ పోలీసులు తనిఖీలు చేపట్టారు. మహిళ ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటంతో ఆమె దగ్గరకు వెళ్లి ఆరాతీశారు. సంచి ఓపెన్ చేసి చూశారు. అప్పుడు దానిలో చనిపొయిన వ్యక్తి కన్పించాడు. వెంటనే ఆమెను అదుపులోనికి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అదే విధంగా.. నేరం కోసం నిందితులు ఉపయోగించిన రేజర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా ... ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) పెనమలూరు మండలం కానూరులోని కేసీపీ కాలనీకి చెందిన తాళ్లపూడి రాంబాబు, స్రవంతి భార్యభర్తలు. భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటోంది.

ఐతే రాంబాబుకు మద్యం తాగే అలవాటుంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బాగా తాగి ఇంటికొచ్చాడు. మత్తులో స్రవంతితో గొడవ పెట్టుకున్నాడు. అప్పటికే భర్తపై విసిగిపోయిన స్రవంతి.. గొడవలు వద్దంటూ గట్టిగా మందలించింది. దీంతో భార్యపై కోపంతో ఊగిపోయిన రాంబాబు.. ఆమెను కొట్టి ఆ తర్వాత బుగ్గ కొరికేశాడు. వెంటనే తప్పించుకొని ఆస్పత్రికి వెళ్లిన ఆమె.. చికిత్స చేయించుకున్న తర్వాత భార్యపై పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాంబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ కేసులో భర్తను అరెస్ట్ చేశారా.. లేక భార్యాభర్తల గొడవ గనుక రాజీ చేసి పంపారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Female harassment, Murder case, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు