హోమ్ /వార్తలు /క్రైమ్ /

సోషల్ మీడియాలో పరిచయం.. యువతిని డాక్టర్ క్లినిక్ లోని గదిలోనికి తీసుకెళ్లి..

సోషల్ మీడియాలో పరిచయం.. యువతిని డాక్టర్ క్లినిక్ లోని గదిలోనికి తీసుకెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar Pradesh: సోషల్ మీడియాలో మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను డాక్టర్ తన క్లినిక్ కు పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

ప్రజల ప్రాణాలను కాపాడే వృత్తిలో ఉండి డాక్టర్లు నీచపు పనికి ఓడిగట్టారు. సభ్యసమాజం ముందు తలదించుకునే విధంగా ప్రవర్తించారు. మనలో చాలా మంది వైద్యులను దైవంతో పోలుస్తుంటారు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్య అయిన వైద్యునితో చెప్పుకుంటారు. కొన్నిసార్లు.. తల్లిదండ్రులతో కూడా చెప్పుకోవడానికి ఇబ్బంది పడే తమ సమస్యలను యువతులు డాక్టర్ల దగ్గర చెప్పుకుంటారు. ఇలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న డాక్టర్లు అమానుష ఘటనకు పాల్పడ్డారు. యువతిని ట్రాప్ చేసి క్లినిక్ కు పిలిపించుకున్నారు.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh) షాకింగ్ ఘటన సంభవించింది.బస్తీజిల్లాలోనిన ఓక ఆస్పత్రిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కైలీ ఆస్పత్రిలోని పనిచేస్తున్న డాక్టర్ సిద్ధార్థ్ అనే డాక్టర్ కు సోషల్ మీడియాలో ఒక యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ఫోన్ నంబర్ లు మార్చుకుని, తరచుగా వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునే వారు. ఇదిలా ఉండగా.. ఒక రోజు డాక్టర్ యువతిని తన క్లినిక్ కు రమ్మన్నాడు. అతని మాటలు నమ్మి, ఆమె క్లినిక్ కు వచ్చింది.

అప్పుడు ఆమెను గదిలోనికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా యువతి అపస్మారక స్థితిలోనికి వెళ్లిందనుకుని, తన మిత్రులను కూడా ఫోన్ చేసి రప్పించాడు. వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత.. బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన దారుణాన్ని ఇంట్లోని వారికి తెలిపింది. దీంతో స్థానిక పోలీసులు డాక్టర్లపై కేసు నమోదు చేశారు. యువతిని టెస్ట్ ల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా తమిళనాడులో (Tamil nadu) దారుణ ఘటన జరిగింది.

చెన్నైలో తన స్నేహితురాలితో కలిసి హోటల్ కు వెళ్లిన యువతి తిరిగి రావడానికి ఉబర్ ఆటోను బుక్ చేసుకుంది. అప్పటికే రాత్రి 10 అయ్యింది. ఈ క్రమంలో ఆటో దిగుతుండగా ఆటో డ్రైవర్ నీచంగా ప్రవర్తించాడు. ఈ ఘటనను విద్యార్థిని ట్విటర్ లో పోస్ట్ చేసి తన బాధను చెప్పుకుంది. దీంతో నెటిజన్లు ఘటనపై తమ నిరసనలు తెలియజేస్తున్నారు.

పోలీసుల ప్రకారం.. చెన్నైలో (Chennai)  ఇషితా సింగ్ అనే డిగ్రీ యువతి స్థానికంగా ఉన్నసిటీ హోటల్ కు వెళ్లింది. తిరిగి ఇంటికి రావడానికి ఉబర్ లో ఆటోను బుక్ చేసుకుంది. అప్పటికే రాత్రి 10 అయ్యింది. ఆమె స్నేహితురాలు ఆటో దిగుతుండగా ఆటో డ్రైవర్ , బాలిక రొమ్మును తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె వెంటనే గట్టిగా అరవడంతో అతను పారిపోయాడు. వెంటనే యువతి.. స్థానికంగా ఉన్న లేడీ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ మహిళా పోలీసులు ఎవరు లేరు. దీంతో ఎఫైఐఆర్ నమోదు చేయలేదు. అక్కడ రాత్రిపూట అని.. స్టేషన్ లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదని యువతి వాపోయింది. ఈ క్రమంలో ఆటోరిక్షా ఫోటోలను ట్విటర్ లో పోస్టు చేసింది. సెల్వం అనే ఉబర్ డ్రైవర్ తన కుడి రొమ్మును నొక్కి అసహ్యంగా ప్రవర్తించాడని తన బాధను ట్విటర్ లో పోస్ట్ చేసింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Uttar pradesh

ఉత్తమ కథలు