హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఉపాధ్యాయుడిని కసితిరా కాల్చి చంపిన ఉపాధ్యాయుడు.. షాకింగ్ వీడియో వైరల్..

ఉపాధ్యాయుడిని కసితిరా కాల్చి చంపిన ఉపాధ్యాయుడు.. షాకింగ్ వీడియో వైరల్..

ఉపాధ్యాయుడిపై విద్యార్థి కాల్పులు

ఉపాధ్యాయుడిపై విద్యార్థి కాల్పులు

Uttar Pradesh: స్టూడెంట్ పాఠశాల ఆవరణలోనే ఉపాధ్యాయుడిని పిస్టల్ తో బెదిరించాడు. అతడిని వారిస్తున్న అసలు పట్టించుకోలేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

కొందరు విద్యార్థులు స్కూల్ లో తప్పులు చేస్తే టీచర్లు పనిష్మెంట్ ఇస్తుంటారు. కొందరు ఏదైన హోమ్ వర్క్ ఇస్తుంటారు. మరికొందరు.. క్లాసులోనే ఏదో రకంగా విద్యార్థి చేసిన తప్పుకు రియలైజ్ అవ్వాలని పనిష్మెంట్ ఇస్తుంటారు. కానీ కొందరు టీచర్ తమకు ఏదో చేయరాని అవమానం చేశాడంటూ కోపం పెంచుకుంటారు. దీనికోసం ఉపాధ్యాయుడిపైన ఎదురుతిరుగుతారు. కొన్నిసార్లు దాడులు చేయడానికి సైతం వెనుకాడరు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh) షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. సీతాపూర్ లో ఒక పాఠశాల విద్యార్థి తన ఉపాధ్యాయుడిని కాల్చడానికి ఏకంగా స్కూల్ లోనే పిస్టల్ తో వచ్చాడు. దాన్ని చూసిన ఉపాధ్యాయుడు భయంతో పరుగులు పెట్టాడు. వద్దని వారించిన అతగాడు వినలేదు. ఈ ఘటన వైరల్ గా మారింది. విద్యార్థి పాఠశాలలో తరచుగా అల్లరి చేస్తుండటంతో అతడిని ఉపాధ్యాయుడి మందలించాడు. దీనిపై కోపం పెంచుకున్న అతగాడు.. ఒక పిస్టల్ ను తీసుకుని, స్కూల్ కు వచ్చాడు. స్కూల్ ఆవరణలో టీచర్ ను పరిగెత్తుకుంటు వెళ్తున్న వదల్లేదు.

ఆయనపై ఏకంగా మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో అక్కడున్న వారు వెంటనే విద్యార్థి చేతిలో నుంచి గన్ ను లాక్కున్నారు. గాయపడిన ఉపాధ్యాయుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో బాధితుడికి చికిత్స అందించిన ఉపాధ్యాయుడు.. మెరుగైన చికిత్స కోసం లక్నో తరలించారు. ప్రస్తుతం ఉపాధ్యాయుడు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. స్టూడెంట్ ను అదుపులోనికి తీసుకుని, పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh) షాకింగ్ ఘటన జరిగింది.

జలౌన్ జిల్లాలోని ఒరాయ్ నగరంలో ఒక యువతిని తాగుబోతు వేధించాడు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి లోనైంది. తాగిన మైకంలో యువతిని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. దీంతో యువతి ఎంత చెప్పిన అతను వినలేడు. దీంతో ఆమె తనకు తెలిసిన వారిని రప్పించింది. కామాంధుడిని అందరిముందే రోడ్డు మీద కూర్చోబెట్టింది. అంతే కాకుండా.. అతడిని చెప్పుతో చితక్కొట్టింది.

దాదాపు.. 20 సెకన్లపాటు.. 40 సార్లు తలపై చెప్పుతో కసితిరా బాదింది. దీంతో అక్కడున్న వారంతా భలే కొడుతుందే అంటూ ఇంట్రెస్టింగ్ గా చూశారు. ఎవరు కూడా యువతిని ఆపే సాహాసం మాత్రం చేయడం లేదు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. భలే కొడుతుంది.. ఇంకొసారి ఏవడు అమ్మాయిల జోలికిపోడు ఈ వీడియో చూస్తే అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు