ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రతి రోజు మహిళలు, బాలికలపై లైంగిక వేధింపుల (harassment) ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోనూ ఇలాంటి దారుణమే వెలుగు చూసింది. స్కూల్ కు వెళ్లిన తొమ్మిదో తరగతి స్టూడెంట్ పై ప్రిన్సిపాల్ కుమారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. అయితే ఇంటికి వెళ్లిన తరువాత బాలిక పరిస్థితి చూసిన తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీశారు. దీంతో ఇది వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాలు.. ఉత్తరప్రదేశ్లో (Uttar pradesh) ఈ దారుణం జరిగింది. ఈటా జిల్లాకు చెందిన పాఠశాలలో ఒక బాలిక (15) తొమ్మిదో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే ఆమె స్కూల్ కు వెళ్లింది. అయితే ఆ రోజు స్కూల్ లో పరీక్ష నిర్వహించారు. బాలిక ఇంటికి వెళ్లేందుకు సిద్ధం అయ్యింది. ఆ సమయంలో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కుమారుడు, టీచర్ అయిన ఒక వ్యక్తి బాలికను పిలిచాడు. క్లాస్ రూమ్ లో ఉన్న కుర్చీని పక్కన ఉన్న వేరే గదిలోకి తీసుకురావాలని చెప్పాడు.
అతను చెప్పినట్లే చేసింది. రూమ్ లోకి తీసుకెళ్లగానే ఆ టీచర్ కూడా ఆ రూమ్ లోకి ప్రవేశించాడు. లోపలి నుంచి గడియపెట్టాడు. ఇది చూసి ఆ బాలికకు ఏం అర్థం కాలేదు. ఆ టీచర్ వెళ్లి బాలిక నోరు మూశాడు. అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె భయపడిపోయింది. తరువాత బాలికపై దారుణంగా లైంగిక దాడికి (rape on girl) పాల్పడ్డాడు. ఈ ఘటనను ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించాడు. ఎవరికైనా చెబితే మళ్లీ ఇలానే అవుతుందని బెదిరించాడు.
అనుకోని ఈ ఘటనతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంటికి భయపడుతూ, వణుకుతూ చేరుకుంది. ఇంటికి వచ్చిన తరువాత పాప పరిస్థితిని తల్లి గమనించింది. ఏం జరిగిందని అడిగింది. అయినా పాప చెప్పలేదు. తీవ్రంగా భయపడుతూనే ఉంది. కానీ తల్లి మెళ్లగా ఆరా తీయడంతో తనపై జరిగిన దారుణ ఘటనను చెప్పింది. ఈ మాటలు విన్న తల్లిదండ్రులు ఒక్క సారిగా షాక్ గురయ్యారు. తరువాత తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.