సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసుల్లో కొందరి బుద్ది వక్రమార్గం పడుతోంది. మహిళలకు రక్షణగా నిలవాల్సిందిపోయి వారిపైనే దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ పోలీసు అధికారి మహిళను రేప్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నౌచాంది పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. "శనివారం రోజున నేను నౌచండి ప్రాంతంలోని ఓ గెస్ట్ హౌస్‌కు నాకు తెలిసిన వ్యక్తితో వెళ్లాను. అయితే ఆ గెస్ట్ హౌస్ ఓనర్ కొడుకు నిందితుడైన పోలీసుకు మధ్య పరిచయం ఉంది. ఈ క్రమంలో అతడు పోలీసుకు ఫోన్ చేసి అక్కడికి పిలిచాడు. దీంతో గెస్ట్ హౌస్‌కు చేరుకున్న ఆ పోలీసు అధికారి రైడ్ పేరిట డ్రామా ఆడాడు. నన్ను, నాతో పాటు వచ్చిన వ్యక్తిని కూడా అతడు బెదిరించాడు. నా తల్లిదండ్రులను పిలవాల్సిందిగా బెదిరింపులకు దిగాడు. అనంతరం నాపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో గెస్ట్‌హౌస్ ఓనర్ కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత నా వద్ద నుంచి డబ్బులు లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు" అని తెలిపింది.
దీనిపై తాను నౌచాంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు తెలిపింది. అయితే నిందితుడు అదే పోలీస్ స్టేషన్‌కు చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. ఆ తర్వాత తాను హపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా తెలిపింది. పోలీస్ అధికారి అతడు చేసిన నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది.
అయితే నౌచాంది పోలీసులు మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. "ఈ ఆరోపణలు అన్ని నిరాధారమైని. దీనిపై ఫిర్యాదు చేయడానికి ఎవరూ కూడా పోలీస్ స్టేషన్‌కు రాలేదు. ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తే.. ఎఫ్ఐఆర్ దాఖలు చేసి చర్యలు తీసుకుంటామం" ని నౌచాంది పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ప్రేమేందర్ శర్మ తెలిపారు.