హోమ్ /వార్తలు /క్రైమ్ /

HIT 3 : గడ్డిలో 9 ఏళ్ల చిన్నారి శవం .. మిస్టరీ కేసును ఛేదించిన పోలీసులు

HIT 3 : గడ్డిలో 9 ఏళ్ల చిన్నారి శవం .. మిస్టరీ కేసును ఛేదించిన పోలీసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mystery Murder Case : అనుకోకుండా నేరం జరిగితే.. అలాంటి కేసుల్ని పోలీసులు టీ తాగినంత తేలిగ్గా డీల్ చేయగలరు. కానీ కావాలని నేరం చేసి.. దాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరిగితే అలాంటి మిస్టరీ కేసుల్ని ఛేదించడం కష్టం. అలాంటి కేసు ఒకటి యూపీ పోలీసులకు హిట్ 2 లాగా తగిలింది. వారి ఎలా డీల్ చేశారో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

డిసెంబర్ 3, 2022. ఉత్తరప్రదేశ్‌లోని.. ఫిలిబిత్‌... పట్టి గ్రామం. అక్కడకు ఐదుగురు వ్యక్తులతో కలిసి.. పోలీస్ టీమ్ వెళ్లింది. అక్కడి గోధుమల తోటలో 9 ఏళ్ల చిన్నారి శవం కనిపించింది. పాప పొట్ట కోసేసి ఉంది. లోపల చెత్తతో నింపి ఉంది. ముఖం పచ్చడైపోయి ఉంది. పక్కన ఓ కత్తి, ఓ ఇటుక, కొన్ని నిద్రమాత్రలు పడేసి ఉన్నాయి.

పోలీసుల్ని అక్కడకు తీసుకెళ్లింది ఎవరో కాదు.. పాప తండ్రి, ముగ్గురు బాబాయ్‌లు, పాప తాత. డిసెంబర్ 2న పాప మిస్సింగ్ అయ్యిందనీ.. రాత్రంతా తన కోసం వెతికామనీ.. తెల్లారి చూస్తే.. ఇలా తోటలో శవమై కనిపించిందని చెప్పిన పాప తండ్రి అనిస్.. బోరున ఏడ్చాడు. ఆ చిన్నారి పేరు ఆనమ్. మూడో తరగతి చదువుతోంది.

పాప అంత దారుణంగా ఎవరు చంపారన్నది తేలాల్సిన ప్రశ్న. మీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా అని పోలీసులు ప్రశ్నించగా.. తమకు శత్రువులు ఎవరూ లేరనీ.. కానీ.. షకీల్‌పై అనుమానం ఉందని చెప్పారు. షకీల్ ఎవరు అన్నది మరో ప్రశ్న. దానికి వారు ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్పారు.

అనిస్‌ తమ్ముడైన షాదాబ్, షకీల్‌ చెల్లి ప్రేమించుకున్నారు. 2018లో ఇద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. దీనిపై షకీల్.. షాదాబ్‌పై రేప్ కేసు పెట్టాడు. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. తన చెల్లిని లేపుకొని వెళ్లిపోయాడన్న కోపంతోనే.. షకీల్ ఈ హత్య చేసి ఉంటాడని.. పాప తండ్రి పోలీసులకు చెప్పాడు.

పోలీసులు పాప శవాన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. ఆ తర్వాత పట్టి గ్రామంలో ఎంక్వైరీ చేశారు. అప్పుడు పోలీసులకు కొత్త విషయం తెలిసింది. డిసెంబర్ 2న... ఆ పాపను షాదాబ్, అతని ఇద్దరు సోదరులు, షాదాబ్ తండ్రి తీసుకెళ్లడం చూసినట్లు తెలిపారు. ఆ తర్వాత వాళ్లే పాప మిస్సింగ్ అయ్యిందంటూ అంతా వెతికారని తెలిపారు. దాంతో పోలీసులు.. అనిస్‌తోపాటూ.. అతని ముగ్గురు సోదరులు, అనిస్ తండ్రిని అదుపులోకి తీసుకొని మళ్లీ ప్రశ్నించారు. వాళ్లు పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో.. డ్రామాలాడుతున్నారని పోలీసులకు అర్థమైపోయింది. గట్టిగా నిలదీయడంతో.. తామే చంపేశామని నిజం బయటపెట్టారు.

ఇదీ జరిగింది :

పోలీసులకు అనిస్ చెప్పిన దాని ప్రకారం.. షకీల్‌ని హత్య కేసులో ఇరికించేందుకు పాప తండ్రి సహా ఐదుగురూ ప్లాన్ వేశారు. డిసెంబర్ 2న షాదాబ్.. అతని ఇద్దరు సోదరులు, తండ్రి కలిసి.. పాపను తీసుకొని పక్క ఊరు పట్టిలో మత కార్యక్రమానికి వెళ్తున్నామని స్థానికులకు చెప్పారు. కానీ పట్టిలోని గోధుమల తోటకు వెళ్లారు. అక్కడ పాప తండ్రి అనిస్ వాళ్లను కలిశాడు. ఐదుగురూ కలిసి పాపకు నిద్రమాత్రలు ఇచ్చారు. తర్వాత ఊపిరాడకుండా చేసి చంపేశారు.

తర్వాత ఇంటికి వెళ్లి... పాప మిస్సింగ్ అయ్యిందని చెప్పారు. రాత్రంతా పాపను వెతికారు. తెల్లవారుజామున మళ్లీ హత్య చేసిన చోటికి వెళ్లి.. ఇటుకరాయితో కొట్టి పాప తలను పచ్చడి చేశారు. పొట్ట కోసి.. చెత్తను నింపారు. ఎవరో పగతో ఇదంతా చేసినట్లు పోలీసులు భావించాలని ఇలా చేశారు. ఆ తర్వాత పోలీసుల్ని కలిసి.. పాప మిస్సింగైందనీ.. తెల్లారి తోటలో శవమై కనిపించిందని డ్రామా ఆడారు. ఐదుగురినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు... జైలుకు పంపారు.

First published:

Tags: Crime news, Crime story, National News

ఉత్తమ కథలు