మహిళ ముందు ఇన్‌స్టెక్టర్ వెధవ్వేషాలు... వీడియో వైరల్ అవ్వడంతో సస్పెండ్

మొదట ఆమె పట్టించుకోలేదు. ఎంతకీ తీరు మార్చుకోకపోవడంతో... ఆమె జరిగిన దారుణాన్ని ప్రపంచం ముందు పెట్టింది.

news18-telugu
Updated: July 1, 2020, 1:28 PM IST
మహిళ ముందు ఇన్‌స్టెక్టర్ వెధవ్వేషాలు... వీడియో వైరల్ అవ్వడంతో సస్పెండ్
మహిళ ముందు ఇన్‌స్టెక్టర్ వెధవ్వేషాలు... వీడియో వైరల్ అవ్వడంతో సస్పెండ్... (credit - twitter)
  • Share this:
అది ఉత్తర ప్రదేశ్‌లోని దేరియా. ఓ మహిళ... తన కూతురుతో కలిసి... పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది. ఓ భూ తగాదాపై కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంది. SHO ఛాంబర్‌కి వెళ్లింది. ఆమెను చూసిన తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)... అసభ్యంగా (Masturbating) ప్రవర్తించసాగాడు. ఆమె చాలా ఇబ్బంది పడింది. "ఛీచీ" అనుకుంటూ... కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానని చెప్పింది. కానీ భీష్మ పాల్ సింగ్... తన బుద్ధి మార్చుకోలేదు. రెండోసారి "ఛీచీ" అనుకుంటూ ఆమె... కాస్త వాయిస్ పెంచి... కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అంది. అయినా అతని తీరు మారలేదు. ఆమెకు చాలా కోపం వచ్చింది. సమాజాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలా తయారైతే... ఇక సమాజాన్ని కాపాడేదెవరు అనుకుంది. వెంటనే తన మొబైల్ కెమెరా ఆన్ చేసింది. ఆ దరిద్రాన్ని షూట్ చేసింది.

ఇక అక్కడి నుంచి వేగంగా బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత... ఇంటికి వెళ్లి... తన బంధువైన మరో మహిళకు ఈ దారుణాన్ని చెప్పింది. ఐతే... ఆ మరో మహిళ కూడా... తనకూ అలాంటి అనుభవం ఎదురైందని చెప్పింది. అంతే... ఈ మహిళకు ఆగ్రహం పెరిగింది. ఇలాంటి వాళ్లను ఊరికే వదలకూడదు అనుకుంది. ఆ సీక్రెట్ వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. వైరల్ అయ్యింది. విషయం ఉన్నతాధికారుల దాకా వెళ్లింది. పోలీస్ స్టేషన్‌కి కాల్ వచ్చింది. ఓ పోలీస్... కాల్ రిసీవ్ చేసుకున్నాడు. అటు నుంచి ఒక్కటే మాట వినిపించింది. "హి ఈజ్ సస్పెండ్" అని. అవును... అతనిపై FIR రాసి... సస్పెండ్ చేశారు. ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతోంది.తాజాగా తెలిసిందేంటంటే... ఆ SHO ఇది వరకు కూడా మహిళల ముందు అసభ్యంగా ప్రవర్తించేవాడట. ఇంతకు ముందు సాలెంపూర్ కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో కూడా అతను సస్పెండ్ అయ్యాడు. ఈ కేసు నమోదైన తర్వాత... దేరియా ఎస్పీ... భట్నీ పోలీస్ స్టేషన్‌కి వచ్చి... అసలు అక్కడ ఏం జరుగుతోందో ఎంక్వైరీ చేశారు.
First published: July 1, 2020, 1:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading