హోమ్ /వార్తలు /క్రైమ్ /

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ స్పీచే కారణం.. పోలీసులు ఎం చెప్పారంటే..

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ స్పీచే కారణం.. పోలీసులు ఎం చెప్పారంటే..

అసదుద్దీన్ ఒవైసీ (File)

అసదుద్దీన్ ఒవైసీ (File)

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై(Asaduddin Owaisi) పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై(Asaduddin Owaisi) పోలీసులు కేసు నమోదు చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా మాట్లాడటం, ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అసదుద్దీన్‌పై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో గురువారం అసదుద్దీన్ ఓ సభలో పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన ర్యాలీకి పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు. అలాగే ఆ సభలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై కూడా అసదుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా ఆరోపణులు వచ్చాయి. ఈ క్రమంలోనే శుక్రవారం బారాబంకి(Barabanki) పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశరాు.

ఇందుకు సంబంధించి పోలీసు సూపరింటెండెంట్ యమునా ప్రసాద్ శుక్రవారం మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 9న పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహల్లా కాట్ర చందనలో AIMIM జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఇందులో కోవిడ్ ప్రోటోకాల్(Covid guidelines) ఉల్లంఘించబడింది. అసదుద్దీన్ తన ప్రసంగం ద్వారా మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. 100 సంవత్సరాల నాటి రామ్ సనేహి ఘాట్ మసీదును ప్రభుత్వం ధ్వంసం చేసిందని, దాని శిథిలాలు కూడా తొలగించబడ్డాయని చెప్పారు. ఇది వాస్తవానికి విరుద్ధం’అని తెలిపారు.

Khairatabad Ganesh laddu prasadam: ఖైరతాబాద్ గణేశుడికి ఈ ఏడాది తాపేశ్వరం నుంచి అందని లడ్డు.. ఈసారి ఎవరు అందజేస్తారంటే..


‘ఈ ప్రకటన ద్వారా అసదుద్దీన్ మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి, ఒక నిర్దిష్ట సమాజాన్ని రెచ్చగొట్టడానికి మరియు మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. అతను ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిపై అనుచితమైన, నిరాధారమైన వ్యాఖ్యలు కూడా చేశారు’అని ఎస్పీ యమునా ప్రసాద్(Yamuna Prasad) చెప్పారు.

Bhabanipur: భవానీపూర్‌లో మమతా బెనర్జీని వర్సెస్ ప్రియాంక.. ఇంతకీ ఆమె ఎవరంటే..?

గురువారం తన ప్రసంగంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి.. లౌకిక వాదాన్ని అంతం చేయడానికి దేశాన్ని హిందూ ప్రాంతంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’అని ఒవైసీ ఆరోపించారు. ట్రిపుల్ తలాక్(Triple Talaq) చట్టాన్ని విమర్శించిన అసదుద్దీన్.. ‘బిజెపి నాయకులు ముస్లిం మహిళలపై అన్యాయం గురించి మాట్లాడుతారు. అయితే హిందూ స్త్రీలను.. వారి భర్తలు విడిచిపెట్టిన విషయంలో మౌనంగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రధాని మోదీపై(Narendra Modi) వ్యక్తిగత దూషణలకు దిగారు.

అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం నుంచి మూడు రోజుల ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. మంగళవారం అయోధ్యలోని రుడౌలి నుంచి బహిరంగ సభ నిర్వహించడం ద్వారా 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు. బుధవారం సుల్తాన్‌పూర్‌లో, గురువారం బారాబంకిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ పార్టీ 100 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది.

First published:

Tags: AIMIM, Asaduddin Owaisi, PM Narendra Modi, Uttar pradesh

ఉత్తమ కథలు