Uttar Pradesh: ఫోన్​ నంబర్​ సేకరించి.. హాలో ఒకసారి నగ్నంగా కాల్​ చేయొచ్చా అని అడిగి.. ఆ తరువాత

ప్రతీకాత్మకచిత్రం

సోషల్​ మీడియా (social media). అసలు ప్రపంచంలోకి తీసుకొచ్చింది మంచి ఉద్దేశంతోనైనా.. కొందరు కేటుగాళ్లు మోసాలకు వాడుతున్నారు. అమాయక జనాలను బలి పశువులను చేస్తున్నారు. ఇక కొందరైతే మరో అడుగు ముందుకేసి అశ్లీల పనులకు తెగబడుతున్నారు. వీడియో కాల్స్ (video calls)​ చేసి తమ పథకం రచిస్తున్నారు.

 • Share this:
  సోషల్​ మీడియా (social media). అసలు ప్రపంచంలోకి తీసుకొచ్చింది మంచి ఉద్దేశంతోనైనా.. కొందరు కేటుగాళ్లు మోసాలకు వాడుతున్నారు. అమాయక జనాలను బలి పశువులను చేస్తున్నారు. ఇక కొందరైతే మరో అడుగు ముందుకేసి అశ్లీల పనులకు తెగబడుతున్నారు. వీడియో కాల్స్ (video calls)​ చేసి తమ పథకం రచిస్తున్నారు. నగ్నంగా వీడియోలు (nude videos) చూపించి.. ఆ తర్వాత డబ్బులకు డిమాండ్​ చేస్తున్నారు. లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరిస్తారు. ఉత్తర​ప్రదేశ్ (Uttar Pradesh)​ కేంద్రంగా జరుగుతున్నఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎవరూ.. కంప్లైంట్ ఇవ్వలేదు. అయితే మరో కేసు దర్యాప్తు చేస్తుంటే పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. 300 మందిని మోసం చేసి.. రూ. 20 కోట్లు వసూలు చేసినట్లు యూపీ పోలీసుల (UP police) దర్యాప్తులో తేలింది. భార్యాభర్తలతో సహా ఐదుగురిని అరెస్టు (arrested) చేశారు. ఈ ఘరానా మోసం పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం..

  ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి.. సలహా

  ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ​లోని ఘాజియాబాద్‌ (Ghaziabad)కు చెందిన సప్నా గౌతమ్‌, యోగేశ్‌ భార్యాభర్తలు. ఈ జంటకు ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆశ పుట్టింది. ఈ దంపతులకు ఆస్ట్రేలియా (Australia)కు చెందిన వ్యక్తి.. ఓ సలహా ఇచ్చాడు. నగ్నంగా వీడియో కాల్స్ (nude video calls) మాట్లాడించి, రికార్డు చేస్తే డబ్బులు లాగొచ్చని చెప్పాడు. అనుకున్నదే పనిగా ఈ దందాలోకి దిగారు భార్యాభర్తలు. అయితే ఇందులో దంపతులు తమ పనిని విభజించుకున్నారు. వ్యక్తుల వివరాలు తెలుసుకోవడం యోగేశ్ పని. సేకరించిన వివరాలతో వీడియో కాల్స్ మాట్లాడటం.. కొంతమంది యువతులకు శిక్షణ ఇచ్చి.. ఇవే పనులు చేయించడం సప్నా చూసుకుంటోంది.

  ఫోన్​ నంబర్లు సేకరించి..

  ఈ దంపతులు దీని కోసం ముందుగా ఓ వెబ్ సైట్ (web site) లో వివరాలు నమోదు చేసుకున్నారు. ఐడీలు క్రియేట్ చేసి నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడేవారు. దీని కోసం నిమిషానికి 200 రూపాయలు పైగా చెల్లించాలి. ఇందులో సగం వెబ్ సైట్ వాళ్లకి.. మిగిలిన సగం వీళ్లకి చేరుతుంది. ఆ రేటు కంటే.. తక్కువకే తాము వీడియోలు (videos) చూపిస్తామంటూ.. బాధితుల నుంచి ఫోన్ నంబర్లు సేకరిస్తారు. డైరెక్ట్ గా వారికే వాట్సాప్ లేదా ఇతర దారుల్లో వీడియో కాల్స్ చేస్తారు. అవతలి వారు నగ్నంగా మాట్లాడేలా చేస్తారు. ఆ టైమ్ లోనే వారు చేసే పనులు రికార్డు చేస్తారు. తర్వాత ఈ దంపతులు తమ పనిని మెుదలు పెడతారు. అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేకుంటే.. వీడియోలు బయట పెడతామని బెదిరిస్తారు. ఇలా ఎంతో మందిని మోసం చేసి.. సుమారు 20 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు.

  యువతులను రిక్రూట్​ చేసుకుని..

  ఈ దందాలో యువతులను కూడా రిక్రూట్ చేసుకున్నారు. నెలకు రూ.25 వేల చొప్పున జీతాలు చెల్లించి నగ్న వీడియో కాల్స్‌ చేయించేవారు. మెసేజ్​లు చేసే వారికి నెలకు రూ.15 వేలు ఇచ్చేవారు. ఎవరికీ దొరకొద్దని.. కొత్త నంబర్లు, తాము ఉంటున్న ప్రదేశాలను మార్చేవారు. ఓ కంపెనీ యజమాని ఫిర్యాదుతో ఈ దందా బయటకు వచ్చింది. తమ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి రూ.80 లక్షలను కంపెనీ ఖాతా నుంచి బదిలీ చేసినట్లు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ పోలీసులకు ఆయన ఫిర్యాదు వెళ్లింది. ఈ కేసు విచారణలో వారు ఘజియాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. అయితే దర్యాప్తు చేస్తుంటే.. హనీ ట్రాప్ విషయం బయటపడింది. ఘటనకు పాల్పడిన భార్యాభర్తలు సహా, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
  Published by:Prabhakar Vaddi
  First published: