టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) బంధువులను హత్య చేసిన.. మోస్ట్ వాంటెడ్ దోపిడీ దొంగ (నిందితుడు) రషీద్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ పోలీసులు వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ దొంగల్లో అతనొకడు. మూడేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. కానీ శనివారం అతనికి బ్యాడ్ టైమ్ బాదేసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీసుల్ని చూసి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో రషీద్ చనిపోయాడు.
2020 ఆగస్ట్ 19నలో పంజాబ్ ... పఠాన్‌కోట్ జిల్లాలోని థరయల్ గ్రామంలో సురేశ్ రైనా అత్తమామలను కొందరు దోపిడీ దొంగలు చంపేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రైనా మామ అశోక్ కుమార్ ఇంట్లో నిద్రపోతున్న సమయంలో దాదాపు 12 మంది దోపిడీ దొంగలు ఆ ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులపై దాడి చేసి.. దోపిడీకి పాల్పడ్డారు. అశోక్ కుమార్ తీవ్ర గాయాలతో స్పాట్ లోనే చనిపోగా... భార్య ఆశారాణి, కొడుకు కౌశల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
దోషులను కఠినంగా శిక్షించాలని అప్పటి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ట్విట్టర్ ద్వారా కోరాడు రైనా. దాంతో ఆయన.. కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కి అప్పగించారు. ఈ హత్యల కేసులో నిందితులంతా చిక్కినా.. ప్రధాన నిందితుడు రషీద్ మాత్రం దొరకలేదు. దాంతో మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించి.. అతని తలకు రూ. 50 వేలు విలువ కట్టారు. ఈ విషయం తెలుసుకున్న రషీద్.. పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు. చివరకు చిక్కాడు, చచ్చాడు.
ఇలా పంజాబ్‌లో హత్యా నేరం చేసిన రషీద్.. ఉత్తరప్రదేశ్ పోలీసులకు చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. ఎన్‌కౌంటర్ల విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని మరోసారి యూపీ పోలీసులు నిరూపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Suresh raina, Uttar pradesh