మానవత్వం రోజురోజుకీ మంటగలిసి పోతుంది. రక్త సంబంధాలు కూడా మరిచిపోయి దిగజారి ప్రవర్తిస్తున్నారు. విలువలు, వరుసలు మరిచి దారుణాలకు ఒడిగడుతున్నారు. రోజురోజుకూ మానవ సంబంధాలు పతనానికి పడిపోతున్నాయి. రక్త సంబంధాలు క్షీణిస్తున్నాయి. పిల్లల కోసం ఆస్తులు, అవసరమైతే శరీర భాగాలు అమ్ముకున్న తల్లిదండ్రులును చూశాం. కానీ, ఇక్కడున్న తల్లి దండ్రులు మానవత్వం మంటల్లో గలిపారు.లగ్జరీ జీవితం కోసం ఈ జంట చేసిన పని అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. కారు కొనేందుకు కన్న పేగును అమ్మకానికి పెట్టారు కర్కశ తల్లిదండ్రులు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్‌లోని తిర్వా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే దంపతులకు మూడు నెలల కిత్రం పండంటి మగబిడ్డ జన్మించాడు. కొన్నాళ్లు హాయిగా గడిచిన వీళ్ల జీవితంలో ఓ దుర్భుద్ది పుట్టింది. విలాసవంతంగా బతకాలన్న కోరిక కలిగింది. ఆశలు హద్దులు దాటాయ్. కోరికలు గుర్రాలయ్యాయ్. ఇందుకోసం తమ పేగు బంధాన్నే అమ్మకానికి పెట్టారు.
ఇందుకు ఏకంగా కన్న కొడుకుని కూడా అమ్మేందుకు సిద్దపడ్డారు. తమ రక్త సంబంధాన్ని కూడా మర్చిపోయారు. సెకండ్ హ్యండ్ కారు కొనేందుకు మూడు నెలల పసికందుకు లక్షన్నర రూపాయలకు ఓ వ్యాపారవేత్తకు అమ్మేశారు. అంతేగాక ఇప్పటికే సెకండ్ హ్యాండ్ కారును సైతం తల్లిదండ్రులు కొనుగోలు చేశారు.
అయితే ఈ ఘటనపై శిశువు అమ్మమ్మ, తాతయ్య గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికి ఇంకా శిశువు వ్యాపారవేత్త దగ్గరే ఉందని, వాళ్ల తల్లిదండ్రులను పిలిచి విచారణ చేపడతామని ఇన్‌స్పెక్టర్ శైలేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు. ఇందులో వారి తప్పుంటే కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, New born baby, Uttar pradesh