Home /News /crime /

UTTAR PRADESH NOIDA WOMAN CONSTABLE DUPED OF RS 60 LAKH BY NRI FROM CANADA ON PRETEXT OF MARRIAGE PAH

Police: మహా ముదురు.. లేడీ పోలీసును బలే బుట్టలో వేసుకున్నాడు.. ఏంచేశాడో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar pradesh: తన తల్లి కెనడాలో ఉంటుందని చెప్పాడు. ఢిల్లీలోని టెలికాం కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. పెళ్లయ్యాక కెనడాలోనే సెటిల్ అవుదామని అన్నాడు.

మనలో చాలా మంది తరచుగా అనేక రకాల మోసాలకు గురౌతుంటారు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్ వెళ్లి తమ గొడును చెప్పుకుంటారు. కొందరు పెళ్లి పేరుతో, డబ్బుల కోసం మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం అనేక మంది సైబర్ నేరగాళ్ళ బారిన పడుతున్నారు. ఇక మ్యాట్రి మోనియల్ మోసాల గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. పెళ్లి పేరుతో పరిచయం చేసుకొని, ఆ తర్వాత.. అవసరాల కోసం డబ్బులు లాగి,ఆ తర్వాత టోకరా ఇస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh)  ఈ సంఘటన జరిగింది. ఒక సునీతావర్మ మహిళ మీరట్ లోని గౌతమ్ బుద్ధనగర్ లో ఉంటుంది. అయితే, ఆమె భర్త చనిపోయారు. ఈ క్రమంలో ఆమె.. రెండో పెళ్లికోసం మ్యాట్రిమోనియల్ (Cyber fraud)  సైట్లలో అనేక మ్యాచెస్ లను చూస్తుంది. ఆ సమయంలో సంజయ్ సింగ్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. తాను ఒక ఎన్నారై అని.. ప్రస్తుతం ఢిల్లీలోని టెలికామ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పాడు. తన తల్లి కెనడాలో ఉంటుందని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత కెనడాలో వెళ్లి సెటిల్ అవుతామని చెప్పాడు.

నీకు ఇష్టమైతే పెళ్లి (Wedding fraud)  చేసుకుందామని ప్రపోజ్ చేశాడు. పాపం.. బాధిత మహిళ అతగాడి మాటలను నమ్మింది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం తన మేనల్లుడికి యాక్సిడెంట్ అయ్యిందని తన ఏటీమ్ లను కంపెనీ బ్లాక్ చేసిందని చెప్పాడు. దీంతో మహిళ 2 లక్షలు ఇచ్చింది. కొన్ని రోజుల పాటు అలాగే మాయ మాటలు చెప్పాడు. ఆ తర్వాత.. విడుతల వారిగా.. 60 లక్షల వరకు వసూల్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత.. తన లావాదేవీలను కంపెనీ బ్లాక్ చేసిందని చెప్పాడు. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో తాను మోసపోయానని... సునీత వర్మకు అనుమానం వచ్చింది. సునీత వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా మైనర్ బాలికపై దారుణం జరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో  (Delhi) దారుణం జరిగింది. కిడ్నాప్ కు గురైన బాలిక, సాముహిక అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పోలీసుల ప్రకారం.. 13 ఏళ్ల బాలిక ఏప్రిల్ 24 సాయంత్రం కూరగాయల కోసం ఇంటి నుంచి బైటకు వెళ్లింది. ఒక ఆటోలో ఎక్కింది. దాన్ని షారుక్ అనే బాలుడు నడుపుతున్నాడు. అతను బాలికకు మాయమాటలు చెప్పాడు. ఆమెకు కూల్ డ్రింక్ ఇచ్చాడు. బాలిక కూల్ డ్రింక్ తాగి స్పృహతప్పి పడిపోయింది. వెంటనే బాలికను  కిడ్నాప్ చేసి టీగ్రీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక ఇంటిలో బాలికకు డ్రగ్స్ ఇచ్చారు.

ఆ తర్వాత.. ఆమెపై మోహిత్ (20), ఆకాష్ (19), షారుక్ (20) లు పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ క్రమంలో బాలిక కనపడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కోసం ఊరంతా పోస్టర్ లు అతికించారు. ఈ క్రమంలో బాలిక టిగ్రీ లో ఉన్నట్లు పోలీసులు ఇన్ ఫార్మర్ ల ద్వారా తెలుసుకున్నారు. ఆ తర్వాత నిందితులు.. బాలికను ఒ రైల్వే స్టేషన్ దగ్గర వదిలేసి పారిపోయారు. వెంటనే స్థానికులు బాలిక విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: CYBER FRAUD, Marriage, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు