కొన్ని సార్లు జీవితంలో అనుకొని సంఘటనలు ఎదురవుతుంటాయి. మనల్ని తీవ్రంగా బాధిస్తాయి. ఆ సమయంలో మనం వాటిని ధైర్యంతో ఎదుర్కొని ముందడుగు వేయాలి. అంతే కానీ కష్టం వచ్చిందని నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే ముగించేయకూడదు. కొందరు చిన్నపాటి కష్టానికే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. పరీక్షలో పాస్ కాలేదని, సరైన ఉద్యోగం రాలేదని, ప్రేమలో విఫలం అయ్యామని.. ఇలా చిన్న పాటి వాటికి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. మరీకొందరు ఏదైన వ్యాధులు వస్తే.. దాన్ని ధైర్యంగా ఎదుర్కొకుండా భయంతో తమ జీవితాన్ని మధ్యలోనే ముగిస్తారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం నోయిడా(NOida Sector) లో జరిగింది.
పూర్తి వివరాలు.. యూపీలోని (Uttar pradesh) నోయిడాలో సెక్టార్ 22 లో దారుణం జరిగింది. అరూప్ సింగ్ (31),శశికళ(29)దంపతులు. అరూప్ సింగ్ ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు మూడేళ్ల క్రితం పెళ్లి బంధంతో (Wedding) ఒక్కటయ్యారు. ఎప్పటికీ కలిసి ఉండాలని ఆశపడ్డారు. భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండే వారు. కానీ విధి వారికి సవాల్ విసిరింది. ఎన్నో ఆశలతో జీవితాన్ని సాగిస్తున్న వారి జీవితంలో క్యాన్సర్ మహామ్మారి వీరీ జీవితంలో చీకటి నింపింది.
అరూప్ సింగ్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండటం వలన ఆస్పత్రికి పరీక్షలు చేయించుకున్నాడు. అప్పుడు ఒక వైద్యులు ఒక షాకింగ్ విషయం వెల్లడించారు. అరూప్ లో క్యాన్సర్ సోకిందని (Cancer effect) అదే విధంగా అది కూడా అడ్వాన్స్ స్టేజీలో ఉందని తెలిపారు. దీంతో ఒక్కసారిగా వీరి జీవితం అంధకారంలో మునిగిపోయింది. ఏంచేయాలో అర్థంకానీ పరిస్థితి ఏర్పడింది. చాలా రోజులు వీరు డిప్రెషన్ లో వెళ్లి పోయారు. కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయారు.
అరూప్, శశికల ఒకరిని విడిచి మరోకరు అసలు ఉండేవారు కాదు. దీంతో వారిద్దరు కలిసి ఒక దారుణానికి పాల్పడ్డారు. తమ గదిలో ఒక సూసైడ్ నోట్ (Suicide note) రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, అరూప్ సింగ్ బయటకు రాకపోవడంతో ఇంటిపక్కన ఉన్నవారికి అనుమానం కల్గింది. ఫోన్ కూడా ఆన్సర్ చేయడం లేదు.
ఎంతకీ డోర్ తీయడం లేదు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి.. డోర్ ను పగలకొట్టి చూడగా దంపతులిద్దరు ఉరివేసుకుని ఆత్మహత్య (husband and wife commit suicide) చేసుకున్నారు. వెంటనే పోలీసులు వారిని కిందకు దించి మార్చురీకి తరలించారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cancer, Family suicide, Husband commit suicide, Uttar pradesh