హోమ్ /వార్తలు /క్రైమ్ /

digital rape: ఉపాధ్యాయుడి అరాచకం.. మైనర్ బాలిక పై ఏడేళ్ల పాటు డిజిటల్ అత్యాచారం..

digital rape: ఉపాధ్యాయుడి అరాచకం.. మైనర్ బాలిక పై ఏడేళ్ల పాటు డిజిటల్ అత్యాచారం..

నిందితుడు

నిందితుడు

Uttar pradesh: ఉపాధ్యాయుడు అత్యంత నీచానికి ఒడిగట్టాడు. మైనర్ బాలిక పై ఏడేళ్ల పాటు డిజిటల్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే దారుణానికి తెగబడ్డాడు. అమాయకురాలైన బాలికను లోబర్చుకున్నాడు. ఆమెపై అఘాయిత్యానికి (Harassment) పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారాన్ని రేపింది. మహిళలు, అమ్మాయిలు ప్రతి చోటు వేధింపులకు, అఘాయిత్యాలకు గురౌతున్నారు. పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు వేధింపులను ఎదుర్కొంటున్నారు. కామాంధులు గుడి, బడి, బస్టాండ్, ఆఫీస్, ఇల్లు ప్రతి చోట మహిళలు, అమ్మాయిలను వేధిస్తున్నారు. ప్రస్తుతం ఒక జుగుప్సకర ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) జరిగిన దారుణం ఆలస్యంగా బయటపడింది. 17 ఏళ్ళ మైనర్ బాలిక యూపీలో ఒక తెలిసిన వారి ఇంట్లో ఉంటుంది. వారి ఇంటికి మారిస్ రైడర్‌ అనే ఆర్టిస్ట్ టీచర్ ఎప్పుడు వస్తుండే వాడు. అతనికి 81 ఏళ్లు. ఈ క్రమంలో బాలిక, కూడా అతనితో మాట్లాడేది. అతని దగ్గర పలు బొమ్మలను ఎలా గీయాలని అడిగి తెలుసుకునేది. అయితే, అతను ఇంట్లో బాలిక ఉన్నప్పుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు.

బాలికను బెదిరిస్తూ.. డిజిటల్ రేప్ కు (Digital rape) పాల్పడేవాడు. డిజిటల్ రేప్ అంటే.. మహిళ లేదా బాలిక ప్రైవేట్ భాగాలలో చేతి వేళ్లు లేదా కాలి వేళ్లను బలవంతంగా చొప్పించడం అని అర్థం. బాలికను ఏడేళ్లుగా ఇదే విధంగా వేధించేవాడు. బాలికకు ఎవరు లేకపోవడంతో తాను.. ఇతగాడి దారుణాలను భరించింది. ఈ క్రమంలో మారిస్ రైడర్‌ వేధింపులు మరీ ఎక్కువకావడంతో ధైర్యం తెచ్చుకొని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఉత్తర ప్రదేశ్ లోని  (Uttar pradesh) నోయిడాలోని ఒక అపార్ట్ మెంట్ లో దారుణమైన సంఘటన జరిగింది.

ఇది ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉన్న అజ్నారా లే గార్డెన్ హౌసింగ్ సొసైటీ లో ఒక ఆగంతకుడు ప్రవేశించాడు. అక్కడే ఉన్న మెట్ల పై నుంచి మహిళలు బాత్రూమ్ లో స్నానాలు చేస్తుండగా తన సెల్ ఫోన్ లో రికార్టు చేశాడు. దీంతో ఈ ఘటనపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పూర్తి వివరాలు.. నోయిడాలోని స్థానిక అపార్ట్ మెంట్ లో ఒక యువకుడు ప్రవేశించాడు. ఆ తర్వాత.. అక్కడ ఉన్న బిల్డింగ్ మెట్లపై నుంచి సీక్రెట్ గా మహిళలు బాత్రూమ్ లో ఉండగా సెల్ ఫోన్ లో బంధించాడు. ఆ తర్వాత.. అక్కడి నుంచి పారిపోయేవాడు. కొందరు మహిళలు దీన్ని గుర్తించి అపార్ట్ మెంట్ కమిటీ కి ఫిర్యాదు చేశారు. వారు అక్కడే ఉన్న సీసీ కెమారాను పరిశీలించారు.

సీసీ కెమెరా రికార్డులను పోలీసులకు ఇచ్చారు. అయిన వారు.. నిందితుడిని పట్టుకోవడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత.. అజ్నారా హౌసింగ్ సొసైటీ సభ్యులు మార్కెట్ వెళ్లినప్పుడు నిందితుడు అక్కడ కన్పించాడు. వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని అదుపులోనికి తీసుకొని స్టేషన్ తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Female harassment, Harassment, Uttar pradesh

ఉత్తమ కథలు