అత్తింట్లో అడుగుపెట్టిన మొదటిరోజే.. ఊహించని షాక్ ఇచ్చిన నవ వధువు

పెళ్లయి అత్తగారింట్లో అడుగుపెట్టిందో లేదో ఓ నవ వధువు ఊహించని షాక్ ఇచ్చింది. రాత్రి విందులో వడ్డించే వంటకాల్లో మత్తు పదార్థాలు కలిపి వడ్డించి.. ఆపై నగలు,డబ్బుతో ఉడాయించింది.

news18-telugu
Updated: December 15, 2019, 4:07 PM IST
అత్తింట్లో అడుగుపెట్టిన మొదటిరోజే.. ఊహించని షాక్ ఇచ్చిన నవ వధువు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెళ్లయి అత్తగారింట్లో అడుగుపెట్టిందో లేదో ఓ నవ వధువు ఊహించని షాక్ ఇచ్చింది. రాత్రి విందులో వడ్డించే వంటకాల్లో మత్తు పదార్థాలు కలిపి వడ్డించి.. ఆపై నగలు,డబ్బుతో ఉడాయించింది. మత్తు ప్రభావం ఎక్కువగా ఉండటంతో మరుసటి రోజు ఉదయానికి గానీ వారికి మెలుకువ రాలేదు. ఇంట్లో వధువు కనిపించకపోవడంతో.. డబ్బు, నగలు మాయం కావడంతో.. ఇదంతా ఆమె పనే అని నిర్దారించుకున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లా చోటా పరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెతో సంబంధం కుదిర్చిన టింకు అనే వ్యక్తి కోసం ఆరా తీయగా.. అతను కూడా పరారైనట్టు తేలింది.

మా కుమారుడు ప్రవీణ్ పెళ్లి కోసం రూ.4లక్షలు ఖర్చు చేశాం. అజాంఘర్‌లో పెళ్లి జరిపించాం. సంబంధం కుదిర్చినందుకు మధ్యవర్తిగా ఉన్న టింకుకు డబ్బులు కూడా ఇచ్చాం. అంతేకాదు,అమ్మాయి తల్లిదండ్రులు పేదవారు కావడంతో.. ఆమెకు నగలు చేయించడం కోసం మావద్దే డబ్బులు తీసుకున్నారు.
వరుడి తండ్రి


జరిగిన ఘటనతో తమ కుటుంబం పరువు పోయిందని వరుడు ప్రవీణ్ వాపోయాడు. తన జీవితంలో ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేకపోయానన్నాడు. ఆర్థికంగా కూడా నష్టపోయామన్నాడు. ఆమెను వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

Published by: Srinivas Mittapalli
First published: December 15, 2019, 4:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading